![Four Youth Drown in Nallamada Vagu](/styles/webp/s3/article_images/2024/05/29/659_0.jpg.webp?itok=Rqx296ug)
బాపట్ల జిల్లా: బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిపారు.
వారంతా కూకట్‌పల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన సన్నీ ,కిరణ్ , నందులుగా గుర్తించారు. రెండు మృతదేహాలు లభించగా, గల్లంతైన మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చినట్లు యువకుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పాపం ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలాగైనా రక్షించాలని పోలీసులను ప్రాధేయపడుతున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment