స్త్రీనిధి రుణంపై వడ్డీ కట్టాల్సిందే! | Farm Loan and Women SHG loan Waiver | Sakshi
Sakshi News home page

స్త్రీనిధి రుణంపై వడ్డీ కట్టాల్సిందే!

Published Mon, Aug 25 2014 2:13 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

స్త్రీనిధి రుణంపై వడ్డీ కట్టాల్సిందే! - Sakshi

స్త్రీనిధి రుణంపై వడ్డీ కట్టాల్సిందే!

‘ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే...’ మనకు తెలిసింది సామెత మాత్రమే. కానీ దీనికి ఆచరణ రూపమిచ్చి చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తోంది. ఎన్నికల వేళ అమలు కాని హామీలిచ్చి అధికారం చేపట్టిన తరువాత ఒకొక్కరి భరతం పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసేం దుకు సిద్ధపడింది. మహిళల ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ అనుచరులు ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
 
 విజయనగరం అర్బన్ :ఎన్నికల హామీ మేరకు రుణా లు ఎప్పుడు మాఫీ చేస్తారా.. అని ఎదురు చూస్తోన్న పొదుపు మహిళా సంఘాలకు ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీ నుంచి పొదుపు మహిళా సంఘాలను రక్షించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు వడ్డీ లేకుండా పొదుపు సంఘాలకు ఇస్తున్న స్త్రీనిధి బ్యాంకు రుణాలపై వడ్డీ చెల్లించాలనిచంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను డీఆర్‌డీఏకు పంపింది. జూలై ఒకటి నుంచి వసూలు చేసిన రుణ వాయిదాల నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది.
 
 స్త్రీనిధి ద్వారా పొదుపు మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణంపై గతంలో ప్రభుత్వం వడ్డీ బ్యాంకులకు చెల్లించేది. ఇప్పుడు అలా కుదర దని, రుణంతో పాటు జూలై నుంచి వడ్డీ కట్టాల్సిందేనని... తరువాత ఎప్పుడో ఆ వడ్డీని సంఘాల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొంది. దీంతో మహిళా సంఘాలు రుణంతో పాటు వడ్డీ కట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీంతో మహిళలు  డీలా పడ్డారు. రుణం ఎప్పుడు మాఫీ అవుతుంద ని ఎదురు చూస్తున్న వారికి ఇది పిడుగులా తాకింది. ప్రభుత్వ ఆలోచన చూస్తుంటే భవిష్యత్‌లో స్త్రీనిధి లక్ష్యా ల నుంచి ప్రభుత్వం తప్పించుకునేటట్టు ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
 లక్ష్యానికి దూరంగా...
 ప్రభుత్వ నిర్ణయంతో స్త్రీనిధి లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల బారి నుంచి కాపాడేందుకు వడ్డీ లేని రుణం ద్వారా మహిళలను ఆదుకునేందుకు 2011 నవంబరులో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందు కోసం ప్రారంభంలో మండల సమాఖ్యల నుంచి రూ.100 కోట్లు సమీకరించగా, మరో రూ.120 కోట్లు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చింది. గడిచిన మూడేళ్లలో ఈ బ్యాంకు ద్వారా జిల్లాలో రూ.50 కోట్ల వరకు రుణాలు అందజేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి దుపు సంఘాలు గ్రామైక్య సంఘం ద్వారా మొబైల్ రిక్వెస్ట్ పంపితే 48 గంటల్లో ఒకొక్క సభ్యురాలికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు రుణం సంబంధిత సంఘం అకౌంట్‌లో జమయ్యేది. ఇలా ఒక్కో సంఘం నుంచి ఆరుగురికి తక్కువ కాకుండా రుణ సదుపాయం పొందే అవకాశం కల్పించారు. గ్రామాఖ్య సంఘాల నిర్వహణ, లావాదేవీల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లుగా విభజించి గ్రేడ్‌ల వారీగా రుణ పరిధిని నిర్ణరుుంచారు.
 
 అర్హత గల  గ్రామాఖ్య సంఘాలకు మూడేళ్లలో రూ.50 కోట్లు రుణం మంజూరు చేస్తే ఇటీవల ఎన్నికల వరకు రికవరీ కూడా అదే స్థాయిలో 98 శాతం జిల్లాలో ఉండేది. రుణ మాఫీ హామీ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వాయి వసూళ్లు 80 శాతానికి పడిపోయింది. స్త్రీనిధి రుణాలకు మాఫీ ఉండదనే విషయూన్ని అధికారులు క్షేత్ర స్థాయిమహిళలకు అవగాహన పెంచడంతో తిరిగి చెల్లింపులు తాజాగా 97 శాతానికి చేరుకున్నాయని స్త్రీనిధి జిల్లా అధికారులు చెబుతున్నారు. తాజాగా రుణంపై వడ్డీని కూడా సంఘాలే కట్టాలని తరువాత ప్రభుత్వం ఆయూ సంఘాలకు జమ చేస్తుందని ఆదేశాలు రావడంతో మహిళలు డీలా పడ్డారు. ఎప్పుడు వడ్డీ కడుతుందో... అసలు కడుతుందన్న నమ్మకమేంటని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు.
 
 14 శాతం వడ్డీ చెల్లించాల్సిందే..
 రుణంపై బ్యాంకులు వసూలు చేసే 14 శాతం వడ్డీని జూలై  నుంచి పొదుపు మహిళా సంఘాల రుణాలపై కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి బ్యాంక్ బోర్డు నిర్ణయం మేరకే వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాదేశాల మేరకే బోర్డులో తీర్మానం చేశారని చెబుతున్నారు.  వడ్డీలేని రుణ పథకం నుంచి తప్పించుకునేందుకే తొలి ప్రయత్నంగా స్త్రీనిధి రుణాలపై ప్రభుత్వం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 
 బోర్డు నిర్ణయం మేరకే వడ్డీ వసూలు
 స్త్రీనిధి బ్యాంకు బోర్డు సమావేశంలో గత నెల తీసుకున్న నిర్ణయం మేరకు జూలై ఒకటి నుంచి రుణ వాయిదాల కు 14 శాతం వడ్డీని కలుపుకొని వసూలు చేస్తున్నామని జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. స్త్రీనిధి రుణాలు కూడా వడ్డీలేని రుణంగానే మంజూరవుతాయని, అయితే వాయిదాతో పాటు కట్టిన వడ్డీ మొత్తాన్ని బ్యాంకు లింకేజి మొత్తంగా ప్రభుత్వం తిరిగి సంఘాలకు మంజూరు చేస్తుందని తెలిపారు. సక్రమంగా చెల్లించిన మహిళల అకౌంట్లలో ఆ మొత్తం తిరిగి జమవుతుందని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement