నోట్లు, చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్న పోలీసులు
విజయవాడ (చిట్టినగర్) : పోలీసుల నుంచి కాల్‌మనీ వ్యాపారులకు ‘సంక్రాంతి పండుగ’ కానుక అందినట్లు సమాచారం. ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న చెక్కులు, నోట్లను పోలీసులు రెండు రోజులుగా తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. గత నెల 16 నుంచి కాల్‌మనీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసిన సంగతి విదితమే. వారం రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో విజయవాడలోని చిట్టినగర్, కేఎల్‌రావునగర్, కొత్తపేటలోని పలువురు ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు వారి నుంచి భారీగా చెక్కులు, నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతోనే వీటికి ముగింపు పలికారు. మరో వైపు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో కాల్‌మనీ వ్యవహారం ముగినట్లే అయింది. ఫైనాన్స్ వ్యాపారులు స్టేషన్ అధికారులను కలిసి తమ చెక్కులు , నోట్లు తిరిగి ఇచ్చేయాలని కోరడంతో ఇచ్చేసినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం కేఎల్‌రావునగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి కోటేశ్వరరావుకు చెక్కులు, నోట్లు తిరిగి ఇచ్చేయడంతో సదరు వ్యాపారి స్టేషన్‌కు సమీపంలోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి పరిశీలించుకున్నట్లు సమాచారం.
కాల్‌మనీ వ్యాపారులకు ‘పండుగ’
Published Sun, Jan 17 2016 1:46 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement
Advertisement