కాల్‌మనీ వేధింపులపై ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
అక్కయ్యపాలెం : కాల్‌మనీ వేధింపులపై ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ కె.వి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆర్.వి.రమణి(57) గతంలో దొండపర్తిలో నివశించేవారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మీ ఫైనాన్స్ నిర్వాహకుడు రెడ్డి వద్ద ఐదేళ్ల కిందట రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నారు. అలాగే కె.వినయ్ వద్ద రూ.50వేలు, కె.వెంకటలక్ష్మి వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు.
గత ఏడాది వడ్డీతో సహా అప్పులు చెల్లించానని, అయితే సంతకాలు చేసిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా ఇంకా డబ్బు చెల్లించాలని వేధిస్తున్నారని రమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కి వెళ్లే దారిలో అడ్డుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.