హిందూపూర్ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కాల్ మనీ బాధిత దంపతులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో కలిశారు. హిందూపూర్‌కు చెందిన శశికుమార్, శ్రీరాములు అనే ఇద్దరు కాల్‌మనీ వడ్డీవ్యాపారులు తమకు రూ.4లక్షలు అప్పు ఇచ్చి రూ.40 లక్షల విలువ చేసే రెండు ఇళ్లను వాళ్ల పేరు మీద బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారని బాధితులు నాగలక్ష్మి, సాయినాథ్ దంపతులు ఎస్పీ ముందు వాపోయారు. బాధితుల గోడు విన్న ఎస్పీ ఈ విషయంపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు.