కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్‌ను శుక్రవారం కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.
రెండు వారాలపాటు రిమాండ్‌కు ఆదేశించిన జడ్జి
విజయవాడ సిటీ: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్‌ను శుక్రవారం కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి డి.సత్యప్రభాకరబాబు ముందు హాజరుపరచగా రెండు వారాలపాటు రిమాండ్‌కు ఆదేశించారు. మాచవరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, ఏడో నిందితుడు దూడల రాజేశ్‌ను అరెస్టు చేయగా, ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.