'కాల్మనీ కంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే నయం' | Vishnu kumar raju takes on call money business | Sakshi
Sakshi News home page

'కాల్మనీ కంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే నయం'

Dec 17 2015 11:12 AM | Updated on Mar 28 2019 8:41 PM

'కాల్మనీ కంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే నయం' - Sakshi

'కాల్మనీ కంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే నయం'

రాష్ట్రంలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షకు రూ. 3 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాల్లో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... కాల్ మనీ సెక్స్ రాకెట్ కంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే నయమని ఆయన పేర్కొన్నారు.

నిందితులు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తే మంచిదే కానీ.... మహిళల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వడ్డీలు కట్టలేని మహిళలను వేధించి వ్యభిచారంలోకి దించడం ఎంతవరకు కరెక్ట్ అని విష్ణుకుమార్ రాజు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement