సెల్ టవరెక్కిన కాల్‌మనీ బాధితుడు
ఐదు గంటల పాటు హైడ్రామా ఇంటి పత్రాలు
ఇప్పిస్తామనడంతో శాంతించిన వైనం
పెనుమాక (తాడేపల్లి) : కాల్‌మనీ బాధితుడు న్యాయం జరగలేదంటూ పెనుమాకలో సోమవారం సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులకు చమటలు పట్టించాడు. బాధితుడు పాతూరి సత్యంబాబు, అతని భార్య జయప్రద కథనం ప్రకారం... సత్యంబాబు తల్లిదండ్రులు గ్రామానికి చెందిన అట్టు అంకమ్మరెడ్డి వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం అనేక సంవత్సరాల క్రితం రూ.60 వేలు వడ్డీకి తీసుకున్నారు. తండ్రి చనిపోయే వరకు వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత సత్యంబాబు దంపతుల వద్ద నూటికి పది రూపాయల చొప్పున వడ్డీ కట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో సత్యంబాబు తండ్రి ఇవ్వాల్సిన నోటుతో పాటు సత్యంబాబుతో మరికొన్ని నోట్లు రారుుంచుకున్న అంకమ్మరెడ్డి మొత్తం రూ.4 లక్షలు కట్టాలని, లేకపోతే నీ ఇల్లు రాసివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టులో కేసు వేస్తానని బెదిరించారు. దీంతో చేసేది లేక రూ.20 లక్షల విలువ చేసే ఇంటిని, ఇంటి స్థలాన్ని అల్లు అంకమ్మరెడ్డి పేరు స్వాధీన అగ్రిమెంట్ సత్యంబాబు రాశారు. ఆ తర్వాత రూ.లక్షా ఇరవై వేలు సత్యంబాబు చెల్లించారు. ఇంకా రూ. 4 లక్షలు ఇవ్వాలని చెప్పి ఇంటి పత్రాలు అతనికి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇంటి పన్ను కూడా తన పేర మార్చుకున్న అంకమ్మరెడ్డి ఇంటి అద్దె ఇవ్వడంలేదని కోర్టు నుంచి నోటీసులు సత్యంబాబుకు పంపించారు.
రూ. వేలల్లో అప్పు తీసుకుంటే రూ.లక్షల్లో కట్టించుకున్నది గాక ఇల్లుకుడా లేకుండా చేశారని మనస్తాపం చెందిన సత్యంబాబు సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ పలుమార్లు సత్యంబాబుతో ఫోన్‌లో చర్చలు జరిపి చివరకు అంకమ్మరెడ్డి వద్ద నుంచి ఇంటి పత్రాలు తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో సత్యంబాబు టవర్ దిగివచ్చాడు. అదే సమయంలో పలువురు స్థానిక మహిళలు అల్లు అంకమ్మరెడ్డి, బాణావత్ నాగేశ్వరరావు నాయక్‌లపై వడ్డీల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అంకమ్మరెడ్డి పరారయ్యూరు. నాగేశ్వరావు నాయక్‌ను మాత్రం ఎస్‌ఐ వీరేంద్రబాబు అరెస్టు చేశారు. తహశీల్దార్ ఎంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.