Satyambabu
-
అయేషా మీరా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసు పునర్విచారణకు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని సూచిస్తూ, దర్యాప్తు పూర్తి చేసి ఏప్రిల్ 28లోగా తొలి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ అధికారులను న్యాయస్థానం అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ఆదేశించింది. విశాఖ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో ఏర్పడ్డ సిట్‌లో సభ్యులుగా హైమవతి, లక్ష్మీ, షెహెరున్నీసా బేగం కొనసాగనున్నారు. కాగా కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. కాగా హైకోర్టు తాజా నిర్ణయంపై అయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు..
అందుకే తప్పు ఒప్పుకున్నా... ఆయేషా కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు వెల్లడి హైదరాబాద్: ‘మా అమ్మను, చెల్లిని చంపేస్తామని, ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నాను’అని ఆయేషా కేసులో హైకోర్టు నిర్దోషి అని తేల్చడంతో బయటకు వచ్చిన సత్యంబాబు పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి, వారం రోజులు తీవ్రంగా కొట్టారని.. ఆ దెబ్బలకే తన కాళ్లు చచ్చుబడి పోయాయని, జైలులో ఉండి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి బాగయ్యాయని తెలిపారు. జైలుకు వెళ్లినప్పుడు నిరక్ష్యరాస్యుడిగా వెళ్లానని, జైలులో చదువుకుని పరీక్షలు రాసి డిగ్రీ పాసయ్యానన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యంబాబు మాట్లాడుతూ .. కేసులో మొదటి నుంచీ ఆయేషా తల్లిదండ్రులు తాను నిర్దోషినని చెపుతూ వచ్చారని, పోలీసులు అన్యాయంగా నన్ను కేసులో ఇరికిస్తే వారే తనకు అండగా నిలిచారని చెప్పారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. కొంతమంది అడ్వకేట్లు వారే ముందుకు వచ్చి కేసును వాదించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయేషా కేసులో నిందితులను పట్టుకుని శిక్ష పడేటట్లు చేసి ఆమె తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం చూడాలన్నారు. తొమ్మిదేళ్లు తాను జైలులో ఉండటంతో తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురైందన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం, వ్యవసాయం చేసుకునేందుకు స్థలం, ఇల్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఒత్తిడితోనే ఇరికించారు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిడి వల్లే దళిత సత్యంబాబును కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యంబాబు తప్పించుకోకుండా ఉండేందుకు ఆయేషా కేసుతోపాటు మరో 18 సంబంధం లేని కేసుల్లో ఇరికించారని తెలిపారు. హైకోర్టు తీర్పులో తప్పుడు కేసులో ఇరికించినందుకు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదే విషయమై త్వరలో గవర్నర్‌ను, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు. డిగ్రీ పట్టా అందుకున్న సత్యంబాబు సత్యంబాబు సోమవారం అంబేడ్కర్ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. సత్యంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో తాను ఎంఏ పూర్తి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాలపై పీహెచ్డీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భవిష్యత్తు ను పునర్మించుకునే పనిలో ఉన్నానని చెప్పారు. -
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
-
సత్యంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ
- రాత్రి వరకు హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు - నేడు విడుదలయ్యే అవకాశం - నిర్దోషిని శిక్షించారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం రాజమహేంద్రవరం క్రైం: ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పిడతల సత్యంబాబు విడుదల్లో జాప్యం జరుగుతోంది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చినా ఉత్తర్వులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులకు శనివారం కూడా అందలేదు. ఈ ఉత్తర్వులు ఆదివారం అందితే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ జైలు వద్ద శనివారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. శుక్రవారమే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో శనివారం సత్యంబాబు విడుదలవుతాడని అంతా ఎదురు చూశారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రజాసంఘాల నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి వచ్చిన సత్యంబాబు తల్లి మరియమ్మ, లాయర్ శ్రీనివాసరావు.. అడ్వకేట్ కౌన్సిల్ ఇచ్చిన కాపీలను జైలు అధికారులకు చూపించారు. ఉత్తర్వులు హైకోర్టు నుంచి నేరుగా వస్తేగానీ జైలు నుంచి విడుదల చేసేందుకు నిబంధనలు అంగీకరించవని అధికారులు చెప్పారు. సత్యంబాబు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు హైదరాబాద్ నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్.ఎం.ఎస్. ద్వారా వస్తాయని ఎదురుచూసినా రాలేదు. పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి నిర్దోషిపై కేసు పెట్టిన పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘాలు, దళితసంఘాలు డిమాండ్ చేశాయి. సెంట్రల్ జైలు వద్ద ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు న్యాయవాది పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక నిరపరాధిని ఎనిమిదిన్నర సంవత్సరాలు జైలులో మగ్గేలా చేశారని ఆరోపించారు. కుటుంబానికి ఆసరాగా ఉండే యువకుడి జీవితాన్ని నాశనం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వైఫల్యంతో నష్టపోయిన రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నిర్దోషికి ఎనిమిదిన్నరేళ్ల శిక్షా ?
సత్యంబాబుకు నష్టపరిహారం ఇవ్వాలి ∙ ప్రజా సంఘాల నాయకులు రాజమహేంద్రవరం క్రైం : ఆయేషా మీరా హత్యకేసులో ప్రధాన నిందితుడిని చేస్తూ పిడతల సత్యంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఏ పాపం తెలియని నిర్దోషి ఎనిమిదిన్నర ఏళ్లు జైలుశిక్ష అనుభవిం చాడరన్నారు. సత్యంబాబుపై పెట్టిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేయడంతో శనివారం అతడు విడుదల అవుతాడని సత్యంబాబు తల్లి మరియమ్మ, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, సత్యంబాబు లాయర్ పి.శ్రీనివాస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్ష¯ŒS సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీ¯ŒS కుమార్, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, బహుజన సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు తదితరులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే హైకోర్టు నుంచి ఉత్తర్వులు సకాలంలో అందకపోవడంతో సత్యంబాబు విడుదల ఆదివారానికి వాయిదా పడింది. కాగా.. జైలు వద్ద మరియమ్మను మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కలిశారు. న్యాయం చేయాలి ఏ నేరం చేయని నా కుమారుడు సత్యంబాబు ఎనిమిదిన్నర ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. నా కుమారుడిని అన్యాయంగా జైలులో పెట్టారు. దాన్ని తట్టుకోలేక నా భర్త బెంగతో మృతి చెందాడు. నా కుమారుడిని జైలులో పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి. – మరియమ్మ, సత్యంబాబు తల్లి ఉద్యోగం ఇవ్వాలి సత్యంబాబును అన్యాయంగా జైలులో పెట్టడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అతడికి ఉద్యోగం ఇచ్చి నష్టపరిహారం అందించాలి. పోలీసులు తొమ్మిది నెలలు దర్యాప్తు చేసి హాస్టల్ పరిసర ప్రాంతాల్లోని 1300 మందిపై కేసులు నమోదు చేశారు. చివరకు సత్యంబాబును ఇరికించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, డీఎ¯ŒSఏ రిపోర్టు, శవం వద్ద ఉన్న లెటర్‌ను కూడా తారుమారు చేశారు. – శ్రీనివాస్, సత్యంబాబు న్యాయవాది అమాయకుడిని బలి చేశారు ఆయేషా ఘటనలో ఓ అమాయకుడిని పోలీసులు బలి చేశారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో పెరిగింది. హత్య ఘటనతో సత్యంబాబుకు సంబంధం లేదని మృతురాలు ఆయేషా మీరా తల్లి చెబుతున్నా పోలీసులు వినలేదు. ఆమాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులపై శాఖాపరమైన విచారణ జరిపాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
సెల్ టవరెక్కిన కాల్‌మనీ బాధితుడు
ఐదు గంటల పాటు హైడ్రామా ఇంటి పత్రాలు ఇప్పిస్తామనడంతో శాంతించిన వైనం పెనుమాక (తాడేపల్లి) : కాల్‌మనీ బాధితుడు న్యాయం జరగలేదంటూ పెనుమాకలో సోమవారం సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులకు చమటలు పట్టించాడు. బాధితుడు పాతూరి సత్యంబాబు, అతని భార్య జయప్రద కథనం ప్రకారం... సత్యంబాబు తల్లిదండ్రులు గ్రామానికి చెందిన అట్టు అంకమ్మరెడ్డి వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం అనేక సంవత్సరాల క్రితం రూ.60 వేలు వడ్డీకి తీసుకున్నారు. తండ్రి చనిపోయే వరకు వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత సత్యంబాబు దంపతుల వద్ద నూటికి పది రూపాయల చొప్పున వడ్డీ కట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో సత్యంబాబు తండ్రి ఇవ్వాల్సిన నోటుతో పాటు సత్యంబాబుతో మరికొన్ని నోట్లు రారుుంచుకున్న అంకమ్మరెడ్డి మొత్తం రూ.4 లక్షలు కట్టాలని, లేకపోతే నీ ఇల్లు రాసివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టులో కేసు వేస్తానని బెదిరించారు. దీంతో చేసేది లేక రూ.20 లక్షల విలువ చేసే ఇంటిని, ఇంటి స్థలాన్ని అల్లు అంకమ్మరెడ్డి పేరు స్వాధీన అగ్రిమెంట్ సత్యంబాబు రాశారు. ఆ తర్వాత రూ.లక్షా ఇరవై వేలు సత్యంబాబు చెల్లించారు. ఇంకా రూ. 4 లక్షలు ఇవ్వాలని చెప్పి ఇంటి పత్రాలు అతనికి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇంటి పన్ను కూడా తన పేర మార్చుకున్న అంకమ్మరెడ్డి ఇంటి అద్దె ఇవ్వడంలేదని కోర్టు నుంచి నోటీసులు సత్యంబాబుకు పంపించారు. రూ. వేలల్లో అప్పు తీసుకుంటే రూ.లక్షల్లో కట్టించుకున్నది గాక ఇల్లుకుడా లేకుండా చేశారని మనస్తాపం చెందిన సత్యంబాబు సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ పలుమార్లు సత్యంబాబుతో ఫోన్లో చర్చలు జరిపి చివరకు అంకమ్మరెడ్డి వద్ద నుంచి ఇంటి పత్రాలు తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో సత్యంబాబు టవర్ దిగివచ్చాడు. అదే సమయంలో పలువురు స్థానిక మహిళలు అల్లు అంకమ్మరెడ్డి, బాణావత్ నాగేశ్వరరావు నాయక్‌లపై వడ్డీల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అంకమ్మరెడ్డి పరారయ్యూరు. నాగేశ్వరావు నాయక్‌ను మాత్రం ఎస్ఐ వీరేంద్రబాబు అరెస్టు చేశారు. తహశీల్దార్ ఎంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.