నూజివీడు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర పరువు తీసిన టీడీపీ నాయకులు అసెంబ్లీలో కూడా నిసిగ్గుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌మనీ కేసులో నిందితులైన తెలుగుదేశం నాయకులను కఠినంగా శిక్షించకుండా వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అంబేడ్కర్ పేరును వాడుకోవడం నీచాతినీచమని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని, ప్రజలే వీరికి తగిన గుణపాఠం చెపుతారని పలువురు హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టే కాల్‌మనీ వ్యవహారంలో ప్రభుత్వ పలాయనవాదం అర్ధమవుతోందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
కాల్‌మనీ వ్యవహారాన్ని తప్పించుకునేందుకే
కాల్‌మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారితే ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. కాల్‌మనీ చర్చ ను తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. కాల్‌మనీ నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
- జీ రాజు, సీపీఎం డివిజన్ కార్యదర్శి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రాష్ట్రంలో కాల్‌మనీ దోపిడీ ఎక్కువైంది. అధికారం ఉండడంతో టీడీపీ కాల్‌మనీ వ్యాపారులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్నప్పటికీ వారిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడాన్ని బట్టే ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదనేది అర్ధమవుతోంది. - గోళ్ల పవన్,
కాంగ్రెస్ నాయకులు, నూజివీడు
అసెంబ్లీలో చర్చకు భయమెందుకు?
ప్రజలను పీడించుకుతింటున్న కాల్ నాగుల గురించి అసెంబ్లీలో చర్చిం చేందుకు టీడీపీ భయపడుతోంది. దీనిని బట్టే కాల్‌మనీలో ఎంత మేరకు టీడీపీ నాయకుల పాత్ర ఉందో ప్రజలకు అర్ధమవుతోంది. ఇప్పటికైనా వారిని కఠినంగా శిక్షించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
- మూడగాని మధు, నూజివీడు
బాధితుల పక్షాన నిలబడాలి
ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలే గాని నిందితులను రక్షించ కూడదు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, తాజాగా కాల్‌మనీ మాఫీయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఇంకా ఎన్ని మాఫియాలు వెలుగు చూస్తాయో అంతుబట్టడం లేదు.
-చిటికెల రామారావు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి, నూజివీడు
కాల్ నాగులను తప్పించేందుకే అంబేడ్కర్ పేరిట నాటకం
Published Fri, Dec 18 2015 12:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement