కాల్మనీ వ్యవహారంలో బాధితుల ఫిర్యాదు మేరకు కర్నూలు సీసీఎస్ ఎస్ఐ సురేష్పై ఆదివారం కేసు నమోదు అయింది.
అనంతపురం : కాల్మనీ వ్యవహారంలో బాధితుల ఫిర్యాదు మేరకు కర్నూలు సీసీఎస్ ఎస్ఐ సురేష్పై ఆదివారం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సురేష్ అనంతపురంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. నగదు అప్పు తీసుకున్న వారి వద్ద నుంచి అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నట్లు సురేష్పై బాధితులు కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు.