అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు.
అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడబోయాడు. రౌడీలతో కలిసి గన్‌తో బెదిరించి ప్రాంసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్నారని బాధితుడు శ్రీనివాసరావు ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.