
నల్లగొండలో కాల్‌మనీ కలకలం
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన కాల్‌మనీ వ్యవహారం తాజాగా నల్లగొండ జిల్లాలో పడగ విప్పింది. నార్కెట్‌పల్లి మండలం, యల్లారెడ్డి గూడెంలో తాజాగా కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనేకమంది బాధితులు కాల్‌మనీ బారిన పడినట్లు తెలిసింది.
రూ.10వడ్డీతో పేదలనే లక్ష్యంగా చేసుకొని డబ్బులిస్తూ వసూలు చేసే క్రమంలో ఓ వ్యక్తి తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నాడు. పేదలు అని కూడా చూడకుండా వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా వారి ఇళ్లలోని మహిళలపై లైంగిక దాడి యత్నాలకు పాల్పడుతున్నాడు. ఆ గ్రామంలోని పెద్దలు కూడా అతడి తీరును సమర్థిస్తుండటం గమనార్హం.