
చంద్రబాబుకు కాల్ మనీ కేసు నివేదిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ గురువారమిక్కడ భేటీ అయ్యారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ గురువారమిక్కడ భేటీ అయ్యారు. కాల్ మనీ వ్యవహారంపై ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
కాగా కాల్ మనీ, సెక్స్ రాకెట్పై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఈ ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించనుంది. అలాగే రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా నిరోధించేందుకు, ఫైనాన్షియర్ల ఆగడాల్ని అరికట్టేందుకు మనీల్యాండరింగ్ చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.