డబ్బు అడిగితే.. అశ్లీల చిత్రాలు బయటపెడతా! | TDP leader mandava ravikanth arrested in call money case | Sakshi
Sakshi News home page

డబ్బు అడిగితే.. అశ్లీల చిత్రాలు బయటపెడతా!

Apr 2 2016 12:25 PM | Updated on Aug 10 2018 8:16 PM

డబ్బు అడిగితే.. అశ్లీల చిత్రాలు బయటపెడతా! - Sakshi

డబ్బు అడిగితే.. అశ్లీల చిత్రాలు బయటపెడతా!

కృష్ణా జిల్లా విజయవాడలో మళ్లీ కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టించింది.

విజయవాడలో కాల్‌మనీ వ్యాపారి రవికాంత్ ఆగడాలు
మహిళల వద్ద అప్పు తీసుకుని ఎగ్గొడుతున్న వైనం
తిరిగి చెల్లించాలని అడిగితే బెదిరింపులు.. టీడీపీ నేతల అండ
కృష్ణలంకలో మహిళల ఆందోళన

విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడలో మళ్లీ కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టించింది. ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో టీడీపీకి చెందిన కాల్మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవికాంత్ ఆరాచకాలపై మహిళా సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. కృష్ణలంకలో రవికాంత్ ఇంటి ఎదుట ఆయనకు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రవికాంత్‌కు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో తన పలుకుబడిని వాడి రెండు రూపాయల వడ్డీ చెల్లిస్తానని మహిళల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ డబ్బును కాల్మనీలో పెట్టుబడిగా పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. కాల్ మనీ కేసుకు సంబంధించిన కేసులో అరెస్టయ్యాడు. 10 మంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలున్నట్లు పోలీసులు వెల్లడించారు. రవికాంత్ కు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అడిగిన మహిళలను బెదిరించేవాడు. డబ్బు అడిగితే వారి అశ్లీల చిత్రాలను పెన్ డ్రైవ్, డీవీడీలలో సేవ్ చేశానని, వాటిని బయటపెడతానని తరచుగా వేధింపులకు గురిచేసేవాడని మహిళలు తమ బాధను చెప్పుకొన్నారు. రవికాంత్ కు అండగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement