కాల్‌మనీ బ్రోకర్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు శనివారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు.
కాల్‌మనీ బ్రోకర్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు శనివారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు. రేపల్లె 7వ వార్డుకు చెందిన తాతయ్య కాల్‌మనీ బ్రోకర్ల వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు పది లక్షల దాకా వడ్డీ చెల్లించాడు. అయితే ఇంకా వేధింపులు ఆపకపోవడంతో శుక్రవారం సాయంత్రం రేపల్లె సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే శనివారం ఉదయం హఠాత్తుగా ఇంట్లోనే మృతిచెందాడు. బాగున్న వ్యక్తి హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.