
జస్ట్ రూ. 4 లక్షలు అప్పుగా ఇచ్చి...
విజయవాడ : నగరంలోని వన్టౌన్లో కాల్మనీ వ్యాపారీ బుద్ధ భాస్కరరావు ఆగడాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో నివసిస్తున్న వృద్ధ దంపతలుకు అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు వ్యాపారీ బుద్ధ భాస్కరరావును ఆశ్రయించారు. వృద్ధ దంపతులకు అప్పుగా రూ. 4 లక్షలు ఇచ్చాడు.
అందుకు ప్రతిగా తుమ్మలపాలెం సెంటర్లోని సదరు దంపతులకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలను తన వద్ద పెట్టుకున్నాడు. ఆ క్రమంలో వృద్ధ దంపతులకు చెందిన స్థలాన్ని బుద్ధ భాస్కరరావు కబ్జా చేశారు. దీంతో వృద్ధ దంపతులు నగర పోలీసులను ఆశ్రయించారు.