సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆన్‌లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చిన వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీలకు, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కాల్ మనీ వేధింపులకు పాల్పడితే ఉపేక్షించమని డీజీపీ హెచ్చరించారు. ఆన్‌లైన్ కాల్‌మనీ బాధితులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించొద్దని సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment