హైదరాబాద్: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే చాలు.. వారిపై దాడిచేసి మహిళల మెడనుంచి అభరణాలు అపహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చైతన్యపురి మారుతీనగర్లో గురువారం ఓ మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మహిళ మెడ నుంచి చైన్ స్నాచింగ్కు యత్నించాడు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రగాయాల పాలైంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహిళపై కత్తితో దాడి.. మృతి
Published Thu, Feb 5 2015 1:14 PM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM
Advertisement
Advertisement