
హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేటలోని ఓ కార్పొరేట్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అభినవ్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు.
మృతుడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది. అభినవ్ వివరాలు తెలియాల్సి ఉంది.