మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌ | Drunken Four Young Women Abuse Locals In Hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌

Published Sun, Aug 23 2020 1:18 PM | Last Updated on Sun, Aug 23 2020 2:29 PM

Drunken Four Young Women Abuse Locals In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫూటుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో హల్‌చల్‌ చేశారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్‌ ఎదురుగా ఉన్నబస్‌స్టాప్‌లో తిష్ట వేశారు. వైట్‌నర్‌ పీల్చుతూ మద్యం కొనేందుకు వచ్చిన వారితో, రోడ్డు వెంట వెళ్తున్నవారితో అకారణంగా గొడవకు దిగారు. వారిపై దాడులు కూడా చేస్తూ నానా హంగామా సృష్టించారు.

తమ వద్ద ఆ యువతులు డబ్బులు కూడా లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. రాత్రి 9 గంటల సమయంలో ఓ యువకుడిపై దాడి చేసి, అక్కడే బస్‌స్టాప్‌లో పడుకుని ఉన్న మరో యువకుడి బట్టలిప్పి మైకంలో ఉన్న యువతులు రౌడీల్లాగా ప్రవర్తించారని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
(చదవండి: దారుణం: మందలించాడని మర్డర్‌ చేశాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement