
మనస్పర్ధలతో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ :నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉంటున్న షిరిడినాథ్(28) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను గతంలో ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసేవాడు. అయితే ఇటీవలే స్టాఫ్ సెలక్షన్స్‌లో ఎంపికయ్యాడు. ఒక నెలలో డిల్లీ సెక్యూరిటీ సర్వీసెస్‌లో జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.
కాగా ఇతని భార్య విజయ కర్నూలు ట్రెసరీ ఆఫీసులో క్లర్క్‌గా పనిచేస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే షిరిడినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.