హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చిపోయారు. పట్టపగలే దోపిడీలకు దిగారు. కంచన్ బాగ్ పరిధిలోని మారుతీ నగర్ వద్ద నాగమణి అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు గొలుసు తెంచుకెళ్లారు. బాధితురాలు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మరో ఘటనలో చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో జరిగింది. రోడ్డు మీద నదుచుకుంటూ వెళుతున్న రాధా దేవి(63) అనే మహిళ మెడలో చైన్ తెంపుకు పోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోయిన బంగారు గొలుసు 4తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.