nagmani
-
కోటమామ కూతురు
బుజమ్మీద పెట్టుకున్న కర్రమీద రెండు చేతులు ఏలాడదీసి ముందు పోతున్న గొర్రెల మందలో ఒక గొర్రెలా కల్సిపోయి పొలానికి పోతున్న చినసుబ్బయ్యమామ, బైలిక్కి పోయత్తన్న నన్ను వాక్కాడ ఆపి ‘‘ఆ నాగమనోల్ల ఇంటికాడెందబ్బాయ్ అంతమందున్నారో’’ అని అడిగేడు. ‘‘ఆటే వత్తంటివే వాళ్ళనే అడగ్గూడదా నన్నడక్కపోతే’’ అని కసురుకున్నట్టు అనేతలికి ‘‘అడుగుదామనుకుని ఆగేనబ్బాయ్ కాని అక్కడి జనాలని చూసి గొర్రెలు బెదిరిపోయి లగుదోల్నియ్, వాటెనకాలే నేను కూడా లగుదోలాల్సి వచ్చిందే, దీనెమ్మ నాయాల్ది ఈ గొర్రెలు నాకు కూడుబెట్టె సంగతి దేవుడెరుగ్గానే ఈటికి మేతమేపటానికి వూరెందో వల్లకాడేందో కూడా తెలుసుకొనే సమయం లేకపోయేనే నా దగ్గర చత్... ’’ అంటా ముందుకి కదిలేడు. నా కళ్ళు గబుక్కున సమాదుల పక్కకి తిరిగినియ్ ఎవరికోసమైన గుంట తీస్తన్నారేమోనని. ఎత్తు పల్లాల మట్టితప్ప మనుసులజాడ కనపళ్ళా అక్కడ. ‘‘హమ్మయ్య’’ అనుకోని హడావిడిగా నాగమనోల్ల ఇంటికి బయల్దేరాను. నాగమనోల్ల ఇంటికెళ్ళే రోడ్డుమూల తిరిగేసరికి ఆరేళ్ళ జాషువాతాత మనవడు మొండిమోల్నసైడుకాలవ మీద కూర్చొని గుంటగిన్నెలో ఎండుమిరగబాయలతో నూరిన గోగూరపచ్చడి మెండుగా కలుపుకొని తింటా కనిపించాడు. వాడిపక్కనే ఒకకుక్క కోడలు తెచ్చే కూటికోసం ఎదురుచూస్తున్న ముసలిఅత్తలా దిగాలుగా కూర్చొని వుంది. ఆ గోంగూర పచ్చడి మంటకి వాడి ముక్కోలోంచి కళ్ళలోంచి కారతన్న నీళ్ళపైన ఈగలు ఒకటేమాయన అరుసుకుంటూ ఎగురుతున్నాయ్. ‘‘నాయాలకాన లెగు ఇక్కడ్నుంచ... ఇంట్లో కూచ్చొని కూడు తినలేవా’’ అని బెదిరించినట్టు అరిసి ‘‘ఓ కాంతత్తో నీ మనవడు ఆ మురికిగుంట పక్కన కూర్చొని కూడు తింటన్నాడు, లోపలికి పిలువు’’ అని అరిసా . ‘‘ఆనాబట్ట నామాట ఏడింటాడబ్బాయ్....’’ అని ‘‘ఒరేయ్ ఒరేయ్ దోవ తప్పినోడో మర్యాదగా ఇంట్లోకి వత్తావా లేకపోతే మెల్లెత్తుకొని రావాల్న’’ అని అర్సింది పిల్లోడి మీద ఇంట్లోనుంచే. వాడు లేవల.‘‘కనీసం గుడ్డలన్న ఎయ్యకూడదా వాడికా ... వాళ్ళమ్మ నాన్నయాడికి బొయేరో.....’’‘‘వాళ్ళకేడ కుదిరిద్దయ్య పిల్లోడికి గుడ్డలెయ్యనో... వాడేమో పొద్దున్నేమొద్దులు కొట్టను పోవాలయ్య ఆ పిల్లేమో గ్రేడింకి పోవాలయ్యే, వాళ్ళు ఎల్లబోయే టయానికి వీడు నిద్దర లేవడయ్యే వాళ్ళకేడ కుదిరిద్ది పిల్లోడి గురించి పట్టించుకోను, వీన్నేమో నా జివానేసి పోయేరు. నేనేమో కూసుంటే లేవలేనయ్యే నుంచుంటే కూసోలేనయ్యే.... ఈనా సితనాపిబట్టేమో సెప్పిన మాట గంగావినడయ్యే.... రేయ్ అక్కడనుంచి లేత్తావా లేవ్వా’’ అంటా సిన్నగా లేసి ఒక సీపురు పుల్ల తీసుకొని వాణ్ని కొట్టడానికి వస్తుంది.‘‘ ఎంత పన్లున్నాగాని పిల్లల్ని జాగ్రత్తగా సూసుకోవద్దంటే.... వాడికి ఆ సైడు కాలవలో దోమలుకుట్టి రేపు డెంగో బుంగో వస్తే అప్పుడు బాధ పడేదెవురొ’’ అంటా నాగమనోల్ల ఇంటి వైపుకి గబా గబా నడిచాను. నాగమణి వాళ్ళ ఇంటికాడికి జనం సేరుకొని, వచ్చినోల్లు వచ్చినట్టు పెద్ద పెద్దగా మాట్లాడకుండా గుస గుస లాడుకుంటూ వున్నారు. ఎవరో తెలియదుగాని ఇద్దరుముగ్గురు ఆడోల్లు దూరంగా నాగమణి రెండునెలల కొడుకు నిద్రపోతున్న మంచంకాడ మూతులకి కొంగు అడ్డం పెట్టుకొని ముక్కులు పైకి ఎగబీల్చుకుంటున్నారు. నాగమణి మొగుడు మాణిక్యరావు కుడితి తొట్టిమీద తల ఏలాడేసుకొని కూసోనివున్నాడు అప్పుడే వూరినుంచి వచ్చినట్టు వున్నాడు కర్రల సంచి ఆయన కాలు పక్కనే వుంది. ఇంకో పక్క నాగమణి నుంచొని ఏడుస్తా వుంది. ‘‘బంగారం లాంటి పిల్లోన్ని నిలువున నాశనం చేసేవు కదంటే సెడిపోయిన్దానా’’ ఆదమరచి నిలుచున్న నాగమణిని ఎగిసి కాలితో తన్నాడు మాణిక్యరావు. అల్లంత దూరంలో పడింది నాగమణి.‘‘నీకు ముసలమేమన్నా పుట్టిందంట్రా సెడు నాబట్ట పచ్చి బాలింతని కాలితో తంతున్నావ్’’ లగుదోలింది కిందబడ్డ నాగమణిని పైకి లేపడానికి నాగమణి అమ్మమ్మ పంచలోనుంచి.కుట్లేసిన కాడ కలుక్కుమన్నట్టుంది నాగమణికి. గబుక్కున తడిమిచూసుకుంది కుట్లు పిగిలి నెత్తురేమన్నా వస్తుందేమోనని. నెప్పేగాని నెత్తురు రాల. తనకలాడుతుంది పైకి లేవడానికి.పద్మ గోడకి కూలబడి వల వల ఏడుస్తుంది. కూతురికి పట్టిన గతిని తలుచుకొని. కోటమామ కూతురుదగ్గరికి పోలేక వెనకడుగు వెయ్యలేక కొయ్యబారిపోయి బిత్తర సూపులు చూస్తున్నాడు జనాలవైపు.‘‘దీనెమ్మ దీన్ని సంపినా పాపంలేదు’’ అంటా పొయ్యికాడ వున్న వూదులుగొట్టం తీసుకొని కిందపడున్న నాగమణి వీపు మీద బాదాడు మాణిక్యరావు. నాగమణి ఆ దెబ్బకి కూసోలేక నున్చోలేక గిల గిల తన్నుకుంటా నేలమీద పడి దొర్లుతుంది.‘‘ఒసే కోపమొస్తే మనిషి కాదమ్మా ఈ ముండమోపోడు... పిల్లని సంపెసేటట్టున్నాడో.... అయ్యో అయ్యో ఆ నా బట్టని లాక్కెల్లండయ్యా మీకు పుణ్యమున్దిద్దె’’ అని ఏడుస్తా మాణిక్యరావుని ఎనక్కి నెడతంది. ‘‘నీ యమ్మ నువ్వు లేయే దాని అంతు తేలుస్తా ఈ రోజు’’ అంటా ఆ ముసలిదాని పక్కకి తోసి నాగమణి మీదకి దూకాడు.‘‘అన్నో ఆ పిల్లమీద ఇంకొక్క దెబ్బ పడిందంటే నీ దొమ్మలు పగుల్తియ్ సెబ్తన్న’’ గట్టిగా అరిసేను ఆయనికి అడ్డంపోయి.వూదులుగొట్టం కిందేసి పిల్లోడు పడుకొని వున్న మంచం కాడికి ఎడుస్తా పోయేడు మాణిక్యరావు.పద్మ గబుక్కున నాగమణి కాడికివచ్చి నాగమణి తల దీసి వొళ్ళో బెట్టుకొని ‘‘అమ్మో నాగమనో లేయే .. తల్లో లేయే ... నా బిడ్డో లేయే ..’’ అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు బెట్టుకుంటా ఏడుస్తా వుంది.‘‘ అయ్యో నువ్వు రాకపోతే సంపెసేవోడయ్యా నా బిడ్డనే.... అమ్మో నాగమనో .... లేయే మనింటికి పోదామో ’’ అంటా నాగమణి కాళ్ళ కాడ కూల బడ్డాడు కోటమామ. ‘‘అబ్బాయ్ అబ్బాయ్ కొంచెం మంచినీళ్ళు తీసుకురండయ్యా ఎవురన్నా బోయే ... మోయ్ నాగమనా మోయ్... ఇటుసూడే తల్లో ....’’ అని హడావిడిపడతా కొంగుతో నాగమణి మొఖమ్మీద గాలి ఇసురుతుంది నాగమణి అమ్మమ్మ. జనాలు నాగమణి దగ్గరకు వచ్చేరు. ‘‘మీరు పక్కకి రండి ఆ పిల్లకి కొంచెం గాలి తగల్నియ్యండి’’ అంటా నాగమణి ముందుకొచ్చి ‘‘అమ్మాయ్ నాగమనా పైకి లెగూ’’ అంటా చెయ్యి పట్టుకుని పైకి లేపేను. నాగమణి కూర్చుంటూ కళ్ళార్పకుండా నా వైపే చూస్తు, ‘‘నా బిడ్డ సచ్చిపోయాడు మామ ....నా బిడ్డ సచ్చిపోయేడు.... నా బంగారి బిడ్డ సచ్చిపోయేడు మామా... నా బంగారు బిడ్డ ... ’’ అంటా పెద్దగాఏడుపందుకుంది. ఎండిపోయిన నాగమణి కళ్ళలో ఎవరో ఏతమేసి తోడినట్టు కన్నీళ్లు వుబికినాయి బయటికి, అవి కిందికి జారి రయికపై అట్టకట్టుకుపోయిన పాలమరకల్లో కలిసిపోయినాయి. ‘‘అమ్మో ఏడవబాకే నీకేమన్నా అయ్యిద్దె ....’’ అంటా అరికాల్లమీద అరిచేత్తో రుద్దుతున్నాడు కోటమామ. అక్కడున్నోల్లన్దరిలో కోటమామే పిరికోడు.మూడు సంవత్సరాల కిందటి మాట....మా అమ్మ కోటమామ పోయిన తరువాత చెప్పింది. అప్పటికే కోటమామ మా ఇంటికీ వచ్చి గంట పైన అయ్యిందంట. మా యమ్మ కూడా అప్పటికే నాలుగైదు సార్లు‘‘ఎందబ్బాయ్ ఇట్టా వచ్చేవో మామ కోసమా ఏంది?’’ అని అడిగినా కూడా ‘‘వూరికినేలేప్పా’’ అంటా అక్కడే నేనొచ్చిన్దాక కూసోని వున్నాడు.నన్ను చూసి గబక్కన సర్దుకొని కూర్చుంటా ‘‘అబ్బాయ్ పెద్దోడా ఇట్టారా ?’’ అన్నాడు.‘‘ఏంది కోటమాం ఈ జామునొచ్చేవ్ ఏంది కతా’’ అని పక్కన కూర్చున్న ఆయన మీదున్న చనువుతో‘‘అది కాదబ్బాయ్ మా గురించి నీకు తెల్వంది ఏముంది? అత్తా నేను నాగపడకుండా పనికిపోయినా ఇల్లు గడవడం కష్టమేనయ్యా... జెరమొచ్చినా తలనొప్పొచ్చిన ఒల్లునొప్పులొచ్చిన బిర్రుగా దుప్పటి కప్పుకొని పడుకుంటా గాని ఆస్పిటిలిగ్గా పోను డబ్బులు కర్చు అవుతాఎమోనని. అప్పో నన్నెక్కడన్నా పెళ్ళిళ్ళలో చూసా’’ అని మమ్మసాయ తిరిగి అడిగి ‘‘కనీసం పెళ్ళిళ్ళకి కూడా పోను సదివిమ్పులు ఇయ్యాల్సి వస్తున్దేమోనని. ఎవురేమైనా అనుకోని పండగపూటకూడా నాగాపెట్టకుండా పనికిపోతా కావాలంటేమన పల్లెల్లో యెవుర్నయినా అడుగు’’‘అబ్బాయ్ కోటయ్య ఇయన్ని పిల్లోడికి ఎందుకు సెప్తన్నా’’ ఎదురడిగింది మమ్మ. నాది కూడా అదే డౌటు కాబట్టి నేను కూడా ఊ అన్నా .‘‘ఇదంతా ఎవురికొస్మప్పా నాగమణి పెళ్లికోసం కదంటే...’’ ఆయనికి ఏడుపు వస్తంది గాని ఆపుకుంటున్నాడు. ‘‘ఎవురు కాదన్నారబ్బాయ్...అసలు సంగతేంది?’’ నావైపు అనుమానంగా చూస్తా అడిగింది ఆయన్ని.‘‘మీ అబ్బాయి నాగమణి తో ఏమన్నాడో నువ్వే అడుగు’’ అన్నాడు కొంచెం కోపంగా.‘‘నేనేమన్నాను ... అసలు దేని గురించి?’’ నాక్కూడా కోపమొచ్చింది.‘‘వచ్చే నెలలో పిల్ల పెళ్లి పెట్టుకుంటిమే ....ఆ పిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే పోలీసు కంప్లెంటు ఇస్తానన్నవంటగా?’’ గుటకలు మింగుతా అన్నాడు. ‘‘ఏందిరా ... పోలీసు కంప్లెంటు ఏంది?’’ అయోమయంగా అడిగింది మా అమ్మ.‘‘అదా ...లేకపోతే ఎందిమా ఆ పిల్లకి పద్నాలుగేళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళంట! కనీసం ఆపిల్ల పుష్పావతన్నా అవ్వద్దంటే?అందులో మాణిక్యరావు అన్నకి ఆపిల్లకి వయసు తేడా పదకొండేళ్ళు...అందుకే ఆపిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే బాల్యవివాహం అని చెప్పి పోలీసు కంప్లెంటు ఇస్తానని చెప్పా?’’ అన్నాను గర్వంగ. ‘‘అప్పో నువ్వు చెప్పే పిల్లకి పెళ్లి సెయ్యాలంటే ఈ రోజుల్లో మనం సెయ్య గలిగి వున్నామా..... ఎంత పనికిమాలినోడుకూడా లచ్చ కట్నం ఇయ్యంది పెళ్లిచేసుకోడయ్యా.... లచ్చలేడ దేవాలప్ప’’ గొంతుకి కల్లె అడ్డం పడి దగ్గేడు, కళ్ళలోంచి నీళ్ళు కారతన్నాయ్. ‘‘నాయాల్ది ఆడపిల్లని కన్న పాపానికి పెళ్లి మనమే సెయ్యలయ్యే, పుట్టింటి సామాన్లు మనమే తేవాలయ్యే,కానుపులు మనమే సెయ్యాలయ్యే, పిల్లకి ఏ కష్టమొచ్చినా మనమే మున్డున్డాలయ్యే.... అన్ని డబ్బులు నాకాడ యాడుండాయిమే... రేయింబగళ్ళు పని చేసినా కూటికే సరిపోతున్నే....ఆ పిల్లోడు మా అక్కాయ కొడుకే కాబట్టి కట్నం బొట్నం ఏమొద్దన్నాడు. ఈ పిల్ల పెద్దమనిశయ్యిందాక ఎదురుచూస్త కూసుంటే వాడి వయసు పోదా? వాడు గాని ఈ పిల్లని పెళ్లి చేసుకోకపోతే నేను డబ్బులేడ్నుంచి తెవాలిమే... పెద్దమనిషి కాకపోతేనేం ఆపిల్లేమన్నా ఇప్పుడు సూట్టానికి సిన్నపిల్లలాగుందా నువ్వుసూడ్లా? ఇప్పుడు పెళ్లిచేస్తే పెద్దమనిషి అయినాకే కాపరం చేసుకుంటారు అప్పుడు దాక పిల్ల మనింట్లోనే ఉండటానికి కూడా పిల్లోడు ఒప్పుకున్నాడు. ఎట్టో కట్ట ఈ పిల్లని వాడికిచ్చి పెళ్లిచేస్తే వాళ్ళ బతుకు వాళ్ళుబతుకుతారు.... లేకపోతే నేను పిల్లకి పెళ్లి చెయ్యగలిగి వున్నానంటప్ప మీ వోడేమో పోలీసులుకి సెప్తానంటన్నే... నేనేడ సావాలో సెప్పప్పా’’ అంటా మా అమ్మ సేతులు పట్టుకున్నాడు. ‘‘ఆయన్న కాకపోతే ఇంకొకడు మామ... కనీసం ఆ పిల్లకి పద్దేనిమిదేల్లన్నా నిండద్దా?’’‘‘నోర్మూసుకోరా ఆయన్ని నీకెందుకు ? వాళ్ళ కూతురు వాళ్ళిష్టం’’ నా మీద అరిసింది మా అమ్మ.‘‘అబ్బాయ్ నువ్వన్నట్టే మా అమ్మాయిని ఆపుతాంగానే ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు... నువ్వే పెళ్లిచేసుకో కట్నంలేకుండా...సరేనా ’’ అన్నాడు కళ్ళుతుడుసుకొని నవ్వుతా‘‘నాగమణికేమి బంగారంలాగ వుండిద్ది ఆపాలేగానే పెళ్లిచేసుకోనా ఏంది?’’ అన్న నవ్వుతా నేను కూడా.‘‘మాటలకేమి గానే ... పెద్దోడో అయ్యో నీకు దండం పెడతా పోలీసులుకి మాత్రం సెప్పబాకయ్య’’ అన్నాడు కొంచెం దీనంగా.‘‘అసె వాడి మాటలకేమొచ్చే గాని నువ్వు పోరే....వాడేదో నవులాటకి అనుంటాడు’’ అంది మా అమ్మ కోట మామతో.‘‘ఆ మాట మీ పిల్లోన్ని సెప్పమనప్పా అట్టానే పోతా... ఈ మాట ఎవుడన్నా సదూకోనోడు గాని అనుంటే నేను నవ్వులాటకే అనుకునేవోన్ని మీవోడు సదూకున్న పిల్లోడైనా అన్నంత పని సేత్తాడేమోనని బయమ్మే ’’ అన్నాడు‘‘ఇప్పుడు నేనేమి పోలీసులుకి సెప్పన్లెకానా రేపు పెళ్ళయినాక నాగమణికి ఏమన్నాకావాలా? అప్పుడున్దిద్ది నీకు’’ అన్న నవ్వుతా. ‘‘నువ్వేం బయపడబాకరా ఈడిప్పుడు కాలేజ్ కి పోతే మల్లి వచ్చేదెప్పుడో... వాడెవురికి సెప్పడ్లే నువ్వు ఇంటికిపోయి పెళ్లి పన్లు చూసుకో’’ అని హామీ ఇచ్చింది మా అమ్మఅది జరిగిన రెండు సంవత్సరాలకి అనుకుంటా క్రిస్మస్ పండగ రోజు కోటమామ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేడు. ఇంటికెల్లా, కావాలనే నాగమణి చేత పిండి వంటలు తెప్పించేడు.‘‘ఇప్పుడు చెప్పరా అల్లుడా నాగమణి ఎట్టుందో? అప్పుడు తెగ బయపడి పోతివే పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేస్తున్నామని? ఇప్పుడు చూడు ఎట్టుందో’’ అన్నాడు కోట మామ.నిజంగానే తేరిపార చూడాల్సి వచ్చింది. ‘‘మామ ఆ రోజు నీ మాటిని నాగమణిని నేను పెళ్లి చేసుకున్నా బాగుండేది మామ? మిస్సయాను పొ’’ అన్నాను అందరు పగలబడి నవ్వారు, మాణిక్యరావు అన్న కూడా.చిన్నప్పటినుంచి నాగమణిని మొఖంలో ఇదే మొదటిసారి ఏడుపు చూడటం. ఎంతో అందంగా ఏ మాత్రం కల్మషంగాని కుట్రబుద్దిగాని లేని నాగమణి అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. అందుకే తన నుండి దూరంగా బయటికొచ్చేసాను. మొన్ననే పండక్కని ఇంటికొచ్చిన నేను నాగమణి ఇక్కడే వుందని తెలుసుకొని ఇంటికి పోయినప్పుడు, కొడుక్కి అప్పుడే నీల్లుపోసిందిగామాల గుండ్రాయిలాగా బొద్దుగా వుండే వాడికి ఒళ్ళు తుడుస్తా ఆ రెండు నెలెల పిల్లోడికి ఆ చొక్కా ఎవరు తెచ్చేరో, ఆ టవలు ఎవరు తెచ్చేరో, వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో, వస్తూ వస్తూ పిల్లోడికోసం ఏమేమి బొమ్మలు తెస్తాడో అని చెబుతుంటే వాడు అవన్నీ నిజంగా వింటున్నట్టు నమ్ముతున్నట్టు వాడి చిట్టి చేతులను బుగ్గలపై రుద్దుకుంటూ, కాళ్ళను ముందుకూ వెనక్కి ఆడిస్తూ, నాగమణి వైపు ఆ చిట్టి కళ్ళతో తీక్షణంగా చూస్తూ వున్నాడు నేను అక్కడికి చేరుకునేసరికి.‘‘అయ్యో నిజమే మీ నాన్న నీకోసం ఒక లారి నిండా సామాను తీసుకొని వస్తున్నాడంట’’ అన్నాను పంచలోకి చేరుకుంటూ.‘‘రా మామా కూర్చో’’ అంటా కాల్లకట్టె వైపు చెయ్యి చూపించింది నవ్వుతా‘‘మేయ్ ఎందిమే పిల్లోన్ని కనమంటే గుమ్మడికాయని కన్నవో’’ అన్నాను పిల్లోడి అరికాళ్ళ వేళ్ళను మెత్తగా నిమురుతూ.‘‘ ఊరుకో మామ పిల్లోడికి మారు పేర్లు పెట్టమాక ...నా బంగారి కొడుక్కీ .....’’ అంటా మురిసిపోయింది.‘‘ ఏమాటకామాటే చెప్పుకోవాలిగాని నాగమనా...మీ పిల్లోడికి అన్నీ నీపోలికలే వచ్చినియ్మే నీలాగే చాల అందంగా ఉన్నాడో....’’ అన్నాను.‘‘ఊరుకో మామ దిష్టిబోద్ది మా పిల్లోడికే’’ అంటా వెంట్రుకల ముడివిప్పి ఆ పొడవాటి వెంట్రుకలతో కాళ్ళ నుంచి తలవరకూ మూడు చుట్లుతిప్పి దిష్టితీసి అరికాల్లో కాటుకతో కుంకుడుకాయంత దిష్టిబొట్టు పెట్టింది. ‘పిల్లోడు మీద అంత జాగ్రత్తగా ప్రేమగా వుండే పిల్లకి ఇట్ట జరిగిందేంది దేవుడా’ అనుకుంటా పక్కనే వున్న బొంకు అరుగు కాడికి వొచ్చేను. ‘‘మామో అవ్వాయ్ సువ్వాయ్ లేమన్నా తేవాలంటే ఒంగోలు పోయే ’’ అంటా సమాదుల్లో గుంట తవ్వను పోతున్న సుధాకరు అక్కడ కూర్చున్న పేతురుతాతని అడిగేడు.‘‘అసె చిన్న పిల్లోడికి అయ్యన్ని ఎందుకురా? ఏదో అంత గుట తీసి బూడ్చిపెట్టకా’’ అన్నాడు చుట్ట ముట్టిస్తా.గుండె జల్లుమంది.‘‘అయ్యో ప్రైటు సీసా ఒకటియ్యయ్యా పిల్ల బాగానీరంసంగా ఉంది’’ అంటా బొంకు కాడికి వచ్చింది నాగమణి అమ్మమ.‘‘నాయనమ్మో అసలెంయ్యిందే నిన్నటిదాకా పిల్లోడు బాగానేఉన్నే ఇంతలోనే ఏందిది’’ అన్నాను‘‘ఏం సెప్పమంటావయ్యా ఆడి గాచారం అట్టరాసుంది... ఎవురు మాత్రం ఏమి సెయ్యగలరు’’ అంది స్ప్రైటు సీసా అందుకుంటా.‘‘ఒరేయ్ అబ్బాయ్ ఇటురాయ్య ఈప్రైటు తీసుకెళ్ళి పద్మమ్మకియ్యి’’ అంటా పక్కనున్న సిన్నపిల్లోడికి ఇచ్చి అరుగు పక్కనున్న సిన్నరాయిమీద కూసుంది.‘‘ మొన్న నేను ఇంటికి పోయినప్పుడు ఎంత బాగున్నాడు పిల్లోడు....పాపం నాగమణి మొకం సూడలేకపోతున్నానే’’ అన్నాను.‘‘అయ్యో రాత్రి పోడుకోబోయేటప్పుడుకూడా పిల్లోడుతో మేమందరం బాగానే ఆడుకుంటిమికదయ్యా , పిల్లోడు మేము సేప్పేయి బాగానే ఆలకించేడు, ఎండుమిరగబాయల్తో బాగానే దిష్టి తీసెను, దోమలు కుడతాయేమోనని దోమతెరకట్టి నేను పక్కనే మంచమేసుకొని పొడుకున్న, అంతా బాగానే ఉన్నే, రెండు మూడు టైం అయ్యేలోకే పిల్లోడు మామూలుగా ఎప్పుడు పాలకి లేవనూ ఏడవనూ చేసేవాడు, అక్కడినుంచి పాపం ఆ పిల్లకి నిద్ర వుండేది కాదు. నాకెందుకో గబుక్కన మెలుకువొచ్చింది ఒక జామున, ఏంది ఇంకా పిల్లోడు పాలకి లేవలేదు అని అనుమానం వొచ్చి నాగమణిని లేపుదాం అని దోమతెరలోకి పోయి పిల్లోన్ని పట్టుకునేలికి పిల్లోడి వొళ్ళంతా సల్లంగా అయిసుగడ్డ లాగుంది. నాకు గుండెలు పగిలే’’ కళ్ళు తుడుసుకుంది.‘‘మేయ్ నాగమనా ఎందిమే పిల్లోడి వొళ్ళు ఇంత సల్లంగా ఉందా అని గబక్కన లైటేసి సూస్తినే... పిల్లోడు తెల్లగా పాలిపోయి నీలక్క పోయి వున్నాడు బిడ్డ, మొవ్ ఉచ్చ పోసుకొని ఉంటాడు లేయే పిల్లోడో... లైటాపే మల్లి వోడు లేచేడంటే నాకు నిద్రున్దదే... అంటా కదిలింది. అప్పడు తెలిసిందయ్యా నాకాపిల్లోడు ఎందుకుసచ్చిపోయేడో....బిడ్డ మొకంమీద నాగమణి రొమ్ము పడివుంది. మొదులుకే దానియి ఎత్తురొమ్ములు దానికితోడు అవి పాలతో నిండి ఇంకా బరువెక్కిల్లా..... పాపం బిడ్డ ఎంత అల్లడిపోయి ఉంటాడో తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తంది. బిడ్ద పిల్లోన్ని బంగారమాల సూసుకునేది... పిల్లోడికి బాగా పాలు పడాలని బాగా కూడు తినేది. దానికి ఏం ముసలం పట్టిందో ఒళ్ళు తెలియకుండా నిద్రబోయింది’’ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ‘‘యెంటనే ఒసే అడ్డల్దానా పిల్లోడు సచ్చిపోయేడే.... లేసి సూడే అనేతలికి, నీ యమ్మ గూప్పగలగొడ్త ఆమాటన్నావంటే నాబిడ్డని అంటా తాసుపాములాగా నా మీదకి లేసిందయ్యా. పిల్లోడి పక్కకి తిరిగి ఈడెమో దుప్పటి కప్పుకోడు ఒళ్లంతా సూడు ఎలా సల్లగయ్యిందో అంటా రొమ్ముతీసి పిల్లోడి నోట్లో పెట్టి నుదుటిమీద ముద్దుపెట్టుకుని శానాసేపు అట్టాగే పడుకుందయ్యా బిడ్డ. నేను పోయి వాళ్ళమ్మా నాయన్ని లేపకొచ్చేలికే.....మా వైపు చూసి, బిత్తరసూపులు సూస్తా, మౌ పిల్లోడికేమయ్యిన్దిమా....బిడ్డ పాలుతాగట్లేదే....ఒళ్లంతా సల్లన్గయ్యిందే ఫానాపండా.... రేపు వాళ్ళనాన్న ఉయ్యాల తెత్తానన్నాడే పిల్లోడ్ని ఉయ్యాలలో పండేద్దామే.....నాపక్కనొద్దె వాడికేమన్నా అయ్యిద్దేమోనని భయంగా వుందే .....అంటానే వుంది కళ్ళనీళ్ళు కారతానే ఉండాయ్...పాపం దానికేమిసెయ్యాలో అర్ధంగాక...’’ ముసల్ది ఇకసెప్పలేక పోయింది.‘‘అంత మొద్దు నిద్రెట్టా పట్టిందిరా దానికి మగల్లారా..... బంగారం లాంటి పిల్లోడు సచ్చిపోయినే’’ అన్నాడు బొంకేసేబు.‘‘ అల్లా బొద్దికూరప్పాడు ఇస్రాన్తమ్మ మనవడు కూడా ఇట్టాగే మామ సచ్చిపోయిందే ‘‘ అన్నాడు పక్కనే వున్నా సిన్నమోసే.‘‘పోయినాదివారం యరజర్లలో ఇట్టాగే ఒక పిల్లోడు వాళ్ళమ్మ జాకెట్కి వుండే పిన్నిసు ఎట్ట కిందపడిందో...అది ఆపిల్లోడ నోట్లోకి ఎట్టాపోయిందో గొంతుకడ్డంపడి గిలగిల కొట్టుకుంటంటే హాస్పిటల్ కి తీసుకెల్లెలికె ప్రాణాలు పోయినియంట’’ చాల బాధ పడతా చెప్పేడు బాబురావు.‘‘చాల జరుగుతున్నయబ్బాయ్ ఇట్టంటియే’’ నిట్టూర్చింది రాయేలు సినమ్మ.‘‘నాగమణి అంత మొద్దుతరాగ నిద్రబోయే పిల్ల కాదె’’ అన్నాను నేను గొనుగుతున్నట్టు.‘‘పిల్లకి ఏవిల్లొచ్చి అయిదోనెల రాన్గల్లోనే తెచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి మొత్తం మీదే బాద్యతన్నట్లు చేతులుదులుపుకొని పోతుంట్రే మొగుళ్ళు, దాని కూటికని, హాస్పిటల్కని, కానుపులుకని కర్సులుమీద కర్సులు సెయ్యాల్సోస్తన్నే.... తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా బిడ్డని కనిపెట్టుకొని కూసోడానికి దాని అమ్మకి అయ్యకి కుదరకపోతున్నే, నాకేమో సుగరొచ్చి మోకాళ్ళ నొప్పులుతోటే అడుగు దీసి అడుగు వెయ్యలేక పోతుంటినే... బిడ్డ దాని తప్పేముందిలె.... పొద్దున్నే లేసి ఇల్లూడ్సి, బాసిన్లు తోమి, గుడ్లుతుక్కొని, కావాల్సింది ఒండుకొని, పిల్లోడికి నీలు పోసి, గుడ్లేసి, అట్టకన్నుమూస్తే పిల్లోడికి ఎమయ్యిద్దో అని కనిపెట్టుకొని వుండాలయ్యే, రాత్రన్న నిద్రబోదామంటే వాడేమో తొమ్మిదికే పొడుకుంటున్నే వాడు పొడుకున్నకే ఈ పిల్ల కూటికి లేవలయ్యే...అన్ని పన్లు చేసుకొని పడుకునేలికి పిల్లోడు నిద్రలేస్తాడయ్యే బిడ్డ అట్టాగే ఎట్టోకట్టా నెట్టకోస్తానే వుంది. అది మాత్రం ఏమి చేసిద్ది. ఎంత కాలం అని నిద్రలేకుండా వుండిద్ది. దాని కర్మకాలి ఇట్టా జరిగే. ఇంకా అదేదో దాని తప్పే అయినట్టు ఆమూగి మొద్దోడేమో వూరినుంచి వచ్చీరాంగల్లోనే గొడ్డుని బాదినట్టు బాదుతున్నే’’ అని సెప్పుకుంటా అక్కడనుంచి లేచి వెళ్లి పోయింది. చాల సేపు ఎవురూ ఏమి మాట్లాడలా. నాకూ అక్కడ కూర్చో బుద్దెయ్యలేదు. అక్కడినుంచి బయటకొచ్చాను.ఒక ఆరేళ్ళ పిల్ల ఇంకో తొమ్మిది నెల్ల పిల్లోన్ని సంకలో ఎత్తుకొని రోడ్డు దాటబోతూ ట్రాక్టర్ హార్న్ విని ఉలిక్కి పడి వెనక్కి వెళ్ళింది.ఒకామె నెత్తిమీద పలుగూ పార పెట్టుకొని సంకలో ఒక పిల్లోన్ని చేతిలో ఇంకో పిల్లోన్ని తీసుకొని నడిజామున మట్టి పని నుంచి ఇంటికి వస్తూ వుంది. సంకలో పిల్లోడు నిద్ర పోతూ తన చేతిలో వేలాడుతూ వున్నాడు.ఇద్దరు పిల్లోల్లు ట్రాన్సా్ఫం దగ్గరలో బచ్చాలాట ఆడుకుంటా వున్నారు.జాషువా మనవడు ఆ వీదిలో పోతున్న కుక్కల్ని రాళ్ళతో కొడుతున్నాడుపిల్లలందరూ అపాయపు అంచునే కనిపించేరు నాకు.పిల్లోని బూడ్చి పెట్టిందాకా అక్కడే వుండి అందరూ పోయాకా స్మశానం గేటు మూసి గొళ్ళెం పెట్టి బయటకొస్తుంటే ముందు గొర్రెలు వాటెనకాల చినసుబ్బయ్యమామ వస్తా కనిపించేరు.‘‘ఎందబ్బాయ్ ఇక్కడున్నావు?’’ అని అడిగేడు ‘‘నాగమణి కొడుకు....’’ చెప్పబోయేను. ట్రాక్టర్ హార్న్ మోగిందిగొర్రెల గుంపు చెల్లా చెదురయ్యింది‘‘హోయ్ ... టుర్ర్ర్ర్.... దీనెమ్మ ఈ గొర్రెలు .....’’ పరిగెత్తేడు.చూస్తూ వున్నాను గొర్రెల గుంపుని, ప్రతి గొర్రె ఇంకో గొర్రెను పట్టించుకోవడంలేదు గాని అన్ని లైన్ లోనే వెళ్తూవున్నాయి. అన్నీ గొర్రెలు మందలో ఉన్నాయన్న ధీమాతో చిన సుబ్బయ్య మామ వాటి వెనకాలె వెళుతున్నాడు. ఒక్క గొర్రె మాత్రం ఆ పోతున్న గొర్రెలను చూస్తూ నిలబడి పోయింది ఇంకేమి చెయ్యలేక. -
ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎల్బీఎస్ నగర్లో నివాసముంటున్న వి. నాగమణి(38) కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కూతురిపై తండ్రి దారుణం
మద్యం మత్తులో ఓ తండ్రి కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్నె ఉపేందర్, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే, ఉపేందర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇదే విషయమై భార్య నాగమణి బుధవారం సాయంత్రం ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన ఉపేందర్ భార్యను కొట్టేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. అక్కడే ఇంటి అరుగుపై కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లగా తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూతురు(7) చెప్పింది. ఈ విషయమై నాగమణి తన తండ్రితో కలసి భర్తను నిలదీయగా వారిపైనా చేయిచేసుకున్నాడు. దీంతో.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ నాగమణి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉపేందర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి.కరుణాకర్ తెలిపారు. -
మీర్పేట్లో చైన్ స్నాచింగ్
మీర్పేట్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగమణి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. చోరీ కాబడిన గొలుసు 5 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలి
-ఎంఈఓ ఉదయ్‌భాస్కర్ జగదేవ్‌పూర్:ఆఫ్రికాలో పర్వాతారోహణ చేసి జాతీయ జెండాను ఎగురవేసిన విద్యార్థి నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్, జెడ్పీటీసీ రాంచంద్రం అన్నారు. జగదేవ్‌పూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని ఆఫ్రికాలో పర్వతరోహణ చేసి శుక్రవారం జగదేవ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా నాగమణికి జగదేవ్‌పూర్ ప్రభుత్వ, ప్రైవైట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధకారులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్సీ కార్యాలయం వద్ద నాగమణికి పూలమాలలు వేసి అభినందించారు. రత్నశ్రీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు నగదు బహుమతి అందించారు. అనంతరం ఎంఈఓ, జెడ్పీటీసీ మాట్లాడుతూ నాగమణి మట్టిలో మణిక్యమని, పేదింట్లో వెలుగు జ్యోతి అని అభినందించారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రంగంలో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఎంపీడీఓ పట్టాభిరామారావు, పాఠశాల ప్రత్యేక అధికారి శారద, పీఆర్టీయూ, టీటీఎఫ్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శశిధర్‌శర్మ, శంకర్, కో-ఆప్షన్ సభ్యుడు మునీర్ ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు దంపతులకు గాయాలు
వేములపల్లి మండలం మంగాపురంలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. పొలంలో వరినాట్లు వేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఈద మల్లయ్య(35), ఈద నాగమణి(32)లను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మహిళ గొంతు నులిమి హత్య
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మానిక్‌బండారు గ్రామ శివార్లలో ఓ మహిళ హత్యకు గురైంది. వర్ని మండలం మోస్రా గ్రామానికి చెందిన నాగమణి (45)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మహత్య కాదు.. హత్య..
అనుమానాస్పద స్థితుల్లో మృతి చెందిన మహిళ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వేముల నాగమణి ఈనెల 13వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, అది ఆత్మహత్య కాదు..హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె సోదరి పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...నాగ మణితో సన్నిహితంగా మెలిగే శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమణిని తనే ఉరి వేసి చంపినట్లు అతడు అంగీకరించాడు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. -
నాగమణి... మణి
నాగమణి పుత్రరత్నం మన సునీల్! సారీ... రత్నం కాదు... మణే! ఆరేళ్ళ వయసులో సునీల్ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి సునీల్‌కి అమ్మయినా, నాన్నయినా నాగమణి గారే! సునీల్ కామెడీ సీన్ల వెనకాల... ఇంతటి అగాధం ఉంటుందని మీరూ నమ్మరేమో! ఇవాళ సునీల్ పుట్టినరోజు... ఈసారి సునీల్ తన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తన గురించి, వాళ్ళమ్మ గురించి అమ్మనే ఇంటర్వ్యూ చేశాడు. ఈ స్టార్ వెనుక అసలుసిసలు స్టార్ అమ్మ. ఆమె మనసులో మాటలే... ఈ వారం ‘స్టార్ టాక్’. సునీల్: అమ్మా! నా పుట్టినరోజు కాబట్టి అక్కడ్నుంచి మొదలు పెడతా. నేను పుట్టినప్పుడు ఏం జరిగింది? నీ ఫీలింగేంటి? సునీల్ అమ్మ నాగమణి: మా నాన్నగారికి అయిదుగురూ ఆడ పిల్లలే. నేను రెండోదాన్ని. ఇక, మా ఫ్యామిలీలో మొదటి మగపిల్లాడివి నువ్వే. పదిహేనేళ్ళకే 1972లో నా పెళ్లైంది. ’74లో పుట్టావు. నాన్నగారు, నేను హైద్రాబాద్‌లో ఉండే వాళ్లం. కాన్పు కోసమే పుట్టింటికి వెళ్లా. హాస్పిటల్లో నువ్వు పుట్టినప్పట్లో ఫోన్లే లేవు. పాలేరుతో కబురెట్టాం. మగపిల్లాడని చెప్పగానే అందరూ హ్యాపీ. నువ్వు నిద్ర పోయే వరకూ వంతుల వారీగా ఎత్తుకొని, ఆడించేవారు. సునీల్:తాతగారు నన్ను బాగా గారం చేసేవాళ్లు. చిన్న ప్పుడు ఏదో సాకుతో స్కూల్‌కు ఎగనామం పెట్టేవాణ్ణి. వెళ్లనిరోజున నాకు కష్టం సుఖం తెలియాలని నాతో పొలం పనులు చేయించేవారు. నాకు ‘బాబోయ్... దీని కన్నా స్కూల్‌కు వెళ్లడం బెటర్’ అనిపించేది. అప్పట్లో ఫిల్మ్‌లు లైటింగ్‌లో పెట్టి చూసుకునే, డబ్బాలుండేవి. ఒకసారి తిరుపతి వెళ్ళి, రాత్రివేళ వచ్చిన తాతయ్య ‘ఫిల్మ్బొమ్మలు తెచ్చా’ అన్నారు. మర్నాడు చూద్దామన్నా మారాం చేసి మరీ అప్పటికప్పుడు ఆ రాత్రే లైట్లు వేసి, చూశా. ఆ ‘బొబ్బిలి పులి’ ఫిల్మ్ స్టిల్స్ ఇప్పటికీ గుర్తు (నవ్వు). అమ్మ నాగమణి: మా ఇంట్లో వీడిదే రాజ్యం. మా నాన్నగారు వీడికి 50 దాకా డ్రెస్‌లు కుట్టించేవారు. తన ఖద్దరు పంచె లతో కుర్తా ైపైజమాలు చేయించేవారు. మా నాన్నగారు పాలు పితకడానికెళితే, పితికినవి పితికినట్లే తాగేసేవాడు. సునీల్: చిన్నప్పుడు నేను అంత అల్లరి చేసేవాణ్ణా? అమ్మ నాగమణి: చాలా చేసేవాడివి. పాకెట్ రేడియో, కెమెరా కనిపిస్తే మొత్తం విప్పి, దాన్లో అయస్కాంతం తీసేవాడు. అందరూ ఇంజనీరవుతాడనేవారు. యాక్టరయ్యాడు. సునీల్: హైద్రాబాద్‌లో నీతో పాటు నేనున్న రోజులు గుర్తేనా? అమ్మ నాగమణి: (‘సాక్షి’ వైపు తిరిగి...) భీమవరం పక్కన పెద్దపుల్లేరులో మా నాన్నగారుండేవారు. వీడు తాత గారి దగ్గర ఉండేవాడు. వీళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా, నేను, ఆయన హైదరాబాద్‌లో. (సునీల్‌తో...) నువ్వు అమ్మమ్మ, తాతయ్యలతో వచ్చేవాడివి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు నిన్ను చూసి ‘ఏంటి మీ తమ్ముడా?’ అని నన్ను అడిగేవారు. ఒక సారి ముగ్గురం ఇక్కడ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాకెళితే చంటిపిల్లాడైన వీడు ఒకటి, రెండుతో బట్టలన్నీ ఖరాబు చేసేశాడు (నవ్వులు...). సినిమా చూడకుండా వచ్చేశాం. చిన్నప్పుడు వీడు ‘కటకటాల రుద్ర య్య’ సినిమా చూసి, పేరు పలకలేక ‘టకటకాల రుద్రయ్య’ అనేవాడు. (నవ్వు). సునీల్ చెల్లెలు సుజాత హైదరాబాద్‌లో మాతో ఉండేది. సునీల్: నేను చిన్నప్పుడు బాగా తినేవాడినా? అమ్మ నాగమణి: (నవ్వేస్తూ) అస్సలు తినేవాడివి కావు. మీ తాతగారింట్లో 12 గుమ్మాలు, కిటికీలుండేవి. వీడికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అన్నం తింటాడని ప్రతి కిటికీ పక్కన ప్లేట్లలో అన్నం కలిపిపెట్టేవారు తాత గారు. సునీల్: లేకలేక మగపిల్లాణ్ణని బయటికెళ్లనిచ్చేవారు కాదు. వెళ్లాలంటే పాలేరునిచ్చి పంపేవాళ్లు. తాతయ్య కష్టపడి పై కొచ్చారు. నాన్న పోయాక, అమ్మను ఊరికి రప్పించేశారు. తాత గారు పోయాక అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. అమ్మ నాగమణి:(‘సాక్షి’ వైపు తిరిగి) సునీల్ వాళ్ళ నాన్న గారు పోయాక ఆయన ఉద్యోగం నాకొచ్చింది. పోస్టల్ శాఖలో క్లర్కగా మొదలెట్టి పైకొచ్చా. చిన్నప్పట్నుంచే సునీల్ బాధ్యతగా ఉండేవాడు. సరుకులు తెచ్చేవాడు. సునీల్: ఒకట్రెండుసార్లు మా నాన్నగారిని చూసినట్లు లీలగా గుర్తు. ఇక జీవితమంతా అమ్మమ్మ, పిన్నమ్మలు, మా అమ్మ, చెల్లెలు మధ్యే గడిచింది. ఆడవాళ్ళ మధ్యే పెరిగాను కాబట్టి, నేను ఇప్పటికీ చాలా ఎమోషనల్. సాక్షి: మీ అబ్బాయికి సిన్మాల్లో ఆసక్తి అని ఎప్పుడు తెలిసింది? అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) చిన్నప్పటి నుంచి వీడికి సిన్మా పిచ్చి. సంక్రాంతి కోడిపందాల దాకా ఆటలు, సిన్మాలే. తర్వాత చదువుపై పడేవాడు. పరీక్షలు పదిరోజుల్లో ఉన్నా యనగా ఇల్లు అదిరేలా పైకి గట్టిగా చదివేవాడు (నవ్వు). సునీల్: అమ్మకి చెప్పకుండా సిన్మాలకెళ్ళిన రోజులున్నాయ్. అమ్మ నాగమణి: భీమవరంలో రోడ్డుకిటు మా ఇల్లు, అటు నటరాజ్ థియేటర్. అంతా కలసి ప్రతి శనివారం సాయం త్రం సినిమాకెళ్ళేవాళ్ళం. అది కాక వీడేమో సరుకులు తేవ డానికని వెళ్ళి, నాకు తెలీకుండా సిన్మా ఇంటర్వెల్ దాకా ఒకరోజు, మిగతా సినిమా మర్నాడు చూసొచ్చేవాడు. సునీల్: మొత్తం చూసొస్తే నీకనుమానం వస్తుందని(నవ్వు). అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) సిన్మా చూసొస్తే, ప్రతి సీన్ యాక్షన్ చేస్తూ చెప్పేవాడు. మూడు గంటలు చెప్పి, ఇక్కడ ఇంటర్వెల్ అనేవాడు. మిగతాది మరో మూడు గంటలన్న మాట (నవ్వు). చిరంజీవి గారు వీడికి ఇన్స్పిరేషన్. అద్దం ముందు నిల్చొని కాళ్లు తొక్కేస్తూ, డ్యాన్సలు చేసేవాడు. సునీల్:: సిన్మాల్లోకి వెళ్తానంటే వద్దనలేదు. ప్రోత్సహించావే? అమ్మ నాగమణి: పిల్లల ఇష్టాన్ని పేరెంట్స్ గమనించి, ప్రోత్స హించాలి. అలా కాకుండా, మనది వాళ్ళపై రుద్దితే, ఎటూ కాకుండా అయిపోతారు. నిన్ను ప్రోత్సహించింది అందుకే. సునీల్: (‘సాక్షి’తో) హైద్రాబాదొచ్చి, ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’లో చిన్న వేషమేశా. కానీ, ఆ సీన్లన్నీ కట్ అయ్యాయి. ఒకచోట గుంపులో వెనక కనిపిస్తా. లాభం లేదని ఊరెళ్ళిపోయి, తర్వాత మళ్ళీ వచ్చా. డ్యాన్స అసి స్టెంట్గా చేశా. రెండేళ్ళ సీనియరైన (త్రివిక్రవ్‌ు) శ్రీనివాస్ సిన్మాల్లోకొస్తున్నాడని మా కజిన్ వల్ల తెలిసి, తనని కలిశా. అమ్మ నాగమణి: నాకు మొదట భయమేసింది. కానీ, శీను (త్రివిక్రవ్‌ు) ఉన్నాడని ధైర్యం. ‘మీరు చూసుకున్నట్లే నేనూ మీ అబ్బాయిని చూస్తా’నన్నాడు. వీళ్ళు హైద్రాబాదెళ్ళాక, పండగొస్తే చాలు తిన్నారో, లేదో అని తలగడలో ముఖం పెట్టుకొని, ఎన్నిసార్లు ఏడ్చానో! మా పాపేమో ‘వాడుంటేనే అన్నీ చేస్తావు’ అని దెబ్బలాడేది (నవ్వు). సునీల్: నిరాశపడ్డప్పుడల్లా నువ్వు నాకెలా బూస్టిచ్చేదానివి? అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) అప్పట్లో ఫోన్లు లేవుగా... వీడికి లెటర్లు రాసేదాన్ని. ‘నువ్వు-నేను’లో అసెంబ్లీ దగ్గర సీన్ సరిగ్గా యాక్ట్ చేయలేకపోయానని వీడు బాధపడ్డాడు. ‘ఈ రోజు సరిగ్గా చేయలేదని బాధపడకు. రేపటి గురించి ఆలో చించు. బాగా చేస్తావు’ అనేదాన్ని. అదే జరిగింది. ఆ సిన్మాకు వాడికి తొలి ‘నంది’ అవార్డు వచ్చింది. ప్రతిభ చాలా మందికి ఉంటుంది. కానీ, కష్టపడ్డవాళ్ళే పైకొస్తారు. సునీల్: ప్రతి ఒక్కరూ నా కన్నా ప్రతిభావంతులే అని నమ్ముతా. ప్రతిభ అంటే వేరే ఏదో కాదు... పని మీద మనకున్న భయం, భక్తి, ప్రేమ. అవి ఉండాలి. కష్టపడాలి. సునీల్:: మరి, యాక్టర్‌నయ్యాక నా కామెడీ నచ్చిందామ్మా? అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) వీడు ఇంట్లో కూడా భలే కామెడీ చేస్తాడు. ఏ మంచి సీన్ చేసొచ్చినా, చెబుతాడు. చేసి చూపిస్తాడు. అప్పట్లో ‘నువ్వేకావాలి’ 5సార్లు చూశా. ‘ఇన్ని ఇడ్లీలు తినలేను. ఒక్కటి తీసేయ్’ అంటూ వీడు నటించిన ‘మనసంతా నువ్వే’లో సీన్ నాకు బాగా ఇష్టం. సునీల్: హీరో అవుతానన్నప్పుడు నీ ఫీలింగేంటి అమ్మా? అమ్మ నాగమణి: ఇదెలా ఉంటుందో చూద్దామనుకున్నా. ‘అందాలరాముడు, మర్యాదరామన్న, తడాఖా’ నచ్చాయి. సునీల్: ‘మర్యాదరామన్న’లో ట్రైన్లో కొబ్బరిబోండాం సీన్ తాడేపల్లిగూడెంలో అమ్మ చూసిన ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి గారు అద్భుతంగా అల్లినదే. సాక్షి: హీరోగా డ్యాన్సలు, ఫైట్లు, సినిమా సక్సెసా కాదా అన్న టెన్షన్లతో శ్రమపడుతుంటే, తల్లి మనసు తల్లడిల్లడం లేదా? అమ్మ నాగమణి: కమెడియన్‌గా కష్టపడ్డాడు, పేరు ప్రతిష్ఠలు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు హీరోగా డ్యాన్స, ఫైట్స్ చేస్తూ దెబ్బలు తగిలించుకొని, ఇంటికొస్తాడు. తల్లిగా బాధనిపిం చినా, కష్టపడుతున్నది మన కోసమేనని సర్దుకుంటా. సునీల్: పాతికేళ్లైనా లేకుండానే భర్త పోతే... ఒంటరిగా అమ్మ నాగమణి: (అందుకుంటూ..‘సాక్షి’తో) నాకు పిల్లలే జీవితం. బాగా పెంచాలి. తండ్రిలేని లోటు వాళ్ళకి తెలీకూడదని తపించేదాన్ని. వేరే ధ్యాసేలేదు. రాత్రి పక్క పక్కనే పడుకొంటే, కష్టం సుఖం, మంచీ చెడు చెప్పేదాన్ని. వాళ్లూ చెప్పినమాట వినేవాళ్ళు. సునీల్: సమాజంతో, చుట్టుపక్కలోళ్ల మాటల్తో కష్టం... అమ్మ నాగమణి: (‘సాక్షి’ వైపు తిరిగి) తెల్లవారగట్టే లేచి, పనులన్నీ చేసేదాన్ని. 7 కల్లా ఆఫీసు కెళ్ళి, 11 కల్లా పిల్లలకు స్వయంగా అన్నం పెట్టాలని వచ్చేసే దాన్ని. మళ్లీ 2గంటలకెళ్లి సాయంత్రం దాకా డ్యూటీ. తలొంచుకొని వెళ్ళడం, రావడం. అంతే. ఎవరూ నన్నూ, నా పిల్లల్నీ వేలెత్తి చూపకూడదనే తపన. సునీల్: మా ఇంటికీ, ఆఫీసుకీ 3 కిలోమీటర్లు. అంటే అమ్మ రోజూ 12 కిలోమీటర్లు నడిచేది. తెల్లారక ముందే బట్టలన్నీ ఉతికి ఆరేసేది. వెలుతురికి పిల్లలు నిద్రలేస్తారని కిటికీలకు కర్టెన్లు కట్టేసేది. మా కోసం ఓవర్టైవ్ు చేసి సంపాదించేది. స్కూలైపోగానే నేను, చెల్లెలు ఆఫీసుకెళ్ళేవాళ్ళం. కార్డులు, కవర్లు, బరువు తూచే కాటాల మధ్య ఆడుకొనేవాళ్ళం. చీకటిపడ్డాక మమ్మల్ని బయటకి పంపడం ఇష్టం లేక అక్కడ ఆడు కొమ్మనేదని అనుకొనేవాణ్ణి. మా అమ్మ తన భద్రతకి మమ్మల్ని పెట్టుకొందని పెద్దయ్యాక అర్థమైంది. అమ్మకు మేము, మాకు అమ్మ బాడీగార్డ! అందరూ జన్మనే ఇస్తారు. (చెమర్చిన కళ్ళతో) కానీ మా అమ్మ మాకు జీవితమిచ్చి, తన జీవితం వదిలేసుకుంది. అమ్మ నాగమణి: (కన్నీళ్ళతో) నాకలాంటి బాధ,భావం ఇప్పటికీ లేవు. పిల్లలే ముఖ్యం, జీవితమనుకున్నా. సునీల్: ఇక్కడ పేరొచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా కష్టపడ్డవారే. అసలు నాకు సపోర్ట మా అమ్మే. సినిమా ఆడకపోతే, ‘నిన్నటిదైపోయింది. రేపేంటో చూడు’అని ధైర్యమిస్తుంది. పెన్షన్ డబ్బులు రెండు, మూడు నెలలు వాడుకోకుండా నా ప్రతి పుట్టినరోజుకూ రూ. 50 వేలు ఇస్తుంది. అమ్మ నాగమణి: వాడికి యాపిల్ ప్రొడక్ట్‌లంటే ఇష్టం. లేటెస్ట్ ఐఫోన్ కొనుక్కోమనిస్తా. ఈసారి లక్ష ఇవ్వాలేమో(నవ్వు). సునీల్: అమ్మకు నేను కారో, ఫోనో కొనివ్వబోతే ‘వద్దురా.. వాడేసింది నాకివ్వు. నువ్వు కొత్తది కొనుక్కో’ అంటుంది. అమ్మ నాగమణి: సంపాదనే నాకిస్తాడు. వేరే గిఫ్టేంటి! ఐనా, నీదేంటి? నాదేంటి? ఇవన్నీ దేవుడివే తప్ప, మనవి కాదు. సునీల్: అమ్మ ఇప్పటి దాకా ఒక్కటే కోరింది. గుర్తుందామ్మా? అమ్మ నాగమణి: సినిమాల్లోకెళ్ళాక వాడికి ఒకటే చెప్పా. ‘ఇక జీవితంలో నిర్ణయాలనీ నీవే. కానీ అనుకూలవతైన అమ్మా యిని చూసే బాధ్యత నాది. ఎందుకంటే నువ్వు పొరపా టు చేస్తే ఇంతకాలం నే పడ్డ కష్టం వృథా’ అన్నా. ‘నువ్వు ఎవరిని చూపిస్తే వారికి తాళి కడతా’నన్నాడు. కట్టాడు. సునీల్: ‘నన్ను ఒక మాదిరిగా చూసుకున్నా చాలు. అమ్మని బాగా చూసుకోవాలి’ అని మా ఆవిడ శ్రుతితో చెప్పా. సునీల్: అమ్మా! ఇంతకీ నాలో నీకు బాగా నచ్చినదేంటి? అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) వీడు మంచోడు. నాకు ఏది చేస్తాడో అదే చెల్లికీ, భార్యకీ చేస్తాడు. ఇప్పటి దాకా వీడి ముందు చెప్పనిదొకటి చెప్పాలి. మా కోడలూ అంతే. తన పిల్లలిద్దరితో పాటు, మా అమ్మాయి పిల్లలిద్దర్నీ కలిపి నలు గుర్నీ ఒకేలా చూస్తుంది. ఎప్పుడైనా ఏదైనా వస్తే తన పిల్లాణ్ణే తిడుతుంది కానీ, ఆడపడుచు పిల్లల్నేమీ అనదు. ఇలాంటి కొడుకు, కోడలున్నందుకు అదృష్టవంతురాల్ని. సునీల్: ఒక ఫ్రెండ్‌తో చెప్పుకోలేనివి కూడా మా అమ్మతో చెప్పుకోగలను. ఇవాళ్టికీ నేను రాత్రి ఇంటికి రావడం ఎంత లేటైనా, విష్ణుసహస్రనామమో, మరొకటో చదువుకుంటూ అమ్మ సోఫాలో కూర్చొని, ఎదురుచూస్తూ ఉంటుంది. అమ్మ నాగమణి: పొద్దున్నైనా, రాత్రైనా చెప్పకుండా వెళ్ళడు. సాక్షి: ఇంత కష్టపడే మీకు... మీ వాడిలో కష్టమనిపించేది? అమ్మ నాగమణి: వీణ్ణి నిద్ర లేపడం. చెప్పిన టైవ్ుకి లేపితే లేవడు (నవ్వులు). ఇక తల్లిగా బాధేంటంటే, వీడందరినీ నమ్మేసి, మోసపోతుంటాడు. తెలివిగా ఉండమంటుంటా! మా అబ్బాయని కాదు కానీ, ఇలాంటి కొడుకు వందలో ఒకడుంటాడు.అందరికీ ఇలాంటి కొడుకుండాలనుకుంటా. సునీల్: జన్మజన్మలకీ ఈ అమ్మకే కొడుకునవ్వాలనుకుంటా! - రెంటాల జయదేవ -
హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చిపోయారు. పట్టపగలే దోపిడీలకు దిగారు. కంచన్ బాగ్ పరిధిలోని మారుతీ నగర్ వద్ద నాగమణి అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు గొలుసు తెంచుకెళ్లారు. బాధితురాలు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో జరిగింది. రోడ్డు మీద నదుచుకుంటూ వెళుతున్న రాధా దేవి(63) అనే మహిళ మెడలో చైన్ తెంపుకు పోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోయిన బంగారు గొలుసు 4తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పూల కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయారు...
పూల కోసం చెరువులో దిగిన అక్కా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు నాగమణి(8), సిద్ధు(5) ఈ రోజు గ్రామ సమీపంలోని ఊర చెరువులో ఉండే అల్లి పూల(తామర పూల వంటివి) కోసం చెరువులోకి దిగారు. చిన్నారులకు ఈత రాకపోవడంతో.. ప్రమాదవశాత్తూ నీట మునిగిగారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వారు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
పాఠశాల కరస్పాండెంట్ వేధింపుల వల్లేనని తండ్రి ఫిర్యాదు కారేపల్లి : పదోతరగతి విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, పోలీసులు తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా మాదారం గ్రామ పంచాయతీలోని కొత్తతండా గ్రామానికి చె ందిన బాణోతు నాగమణి(15) స్థానిక ప్రగతి విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 7న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లిన నాగమణిని పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి స్కూల్ ఫీజు అడిగాడు. ఫీజు చెల్లించలేకపోతే తన గదికి రావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీంతో, ఆమె రెండు రోజుల నుంచి పాఠశాలక వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తండ్రి శంకర్ గురువారం ఉదయం ప్రశ్నించడంతో.. ఆమె అసలు విషయం బయటపెట్టింది. పాఠశాలకు వెళ్లవద్దని చెప్పి, ఆయన పొలం పనులకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని సింగరేణి తహసీల్దారు ఎం.మంగీలాల్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కారేపల్లి పోలీసులు పంచనామా నిర్వహించారు. నాగమణి తండ్రి ఫిర్యాదుతో పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డిపై ఎస్ఐ బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, నాగమణి ఆత్మహత్యపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
పాతబస్టాండ్: కలెక్టరేట్ సోమవారం ఉదయం ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఉద్యమించాయి. జీతాలు, భోజనం తయారీ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ‘ఉపాధి’ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారి సంఘ సభ్యులు, జ్యూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం వరకూ వారి నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది. వంట కార్మికులకు రూ.2 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి వంట ఏజెన్సీలకు రూ.2 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని వారి ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. వంట నిర్వాహకులు చేసిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు నింగినంటాయని, కంటింజెన్సీ నిధులు రెట్టింపు చేయాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వంట చేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు ఎక్కువవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేయడానికి గ్యాస్ సరఫరా చేయాలని, గుడ్డు, స్వీటు పెట్టిన రోజు అదనపు బడ్జెట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూట్ లాకౌట్ ఎత్తివేయాలి పైడిభీమవరంలోని స్వర్ణాంధ్ర, జి.సిగడాం మండలం చీడివలస వద్దనున్న శ్రీకాకుళం జూట్ కర్మాగారం లాకౌట్లను ఎత్తివేయాలని ఆ కర్మాగారాల యూనియన్ ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికులను రోడ్డుపైకి నెట్టారని విమర్శించారు. ముందస్తునోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి వేతన సమస్యలు తీర్చకుండా కాలంగడుపుతూ వస్తోందని, పలుసార్లు యాజమాన్యాలకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరిస్తూ లాకౌట్ ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.తిరుపతిరావు, డి.బలరాం తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర సహాయకులను కొనసాగించాలి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను విరమించుకోవాలని వారి సంఘ నాయకుడు కె.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యోచనకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్ర సహాయకుల రిలే నిరాహారదీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధి వ్యవస్థను బలీయం చేసి సహకరించాల్సిన తరుణంలో ఈ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవో 2614, 1090లను నిలుపుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మందిని తొలగించేందుకు చేసే ప్రయత్నాన్ని నిలుపుదల చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.సూరిబాబు, డి.గోవిందరావు, పంచాది పాపారావు, టి.తిరుపతిరావు, బి.సూరయ్య, డి.గణేశ్ ప్రసంగించారు. తొలిరోజు దీక్షలో కె.లక్ష్మణరావు, ఎన్.రామకృష్ణ, కె.చంద్రశేఖర్, కె.లచ్చుము, నారాయణరావు, కిశోర్‌కుమార్, రామారావు, శ్యామలరావు, గోవిందమ్మ, రామకృష ఉన్నారు. -
అస్తవ్యస్తం, గందరగోళం
ముంబై: శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి అస్తవ్యస్తంగా మారిందని, అందులో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఎన్సీపీ విమర్శించింది. సిద్ధాంతాలు ఒక్కటికాకపోయినా కేవలం అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఇవన్నీ ఏకమయ్యాయని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మలిక్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘గడ్కరీ, ముండే శిబిరాల మధ్య అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరుకున్నాయన్నాయి. శివసేన, బీజేపీలు కూడా పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఎన్డీయేలోకి శరద్‌పవార్ రాకుండా అడ్డుకున్నానని ముండే చెబుతారు. అయితే బీజేపీ తీరుతో విసిగిపోయినపుడు ఆయన 10 జనపథ్ (సోనియాగాంధీ నివాసం)కు వెళ్లారు. అయితే ముండే సన్నిహితులు కొందరు ఆయనను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు’ అని అన్నారు. బీజేపీ వాస్తవానికి వ్యాపారుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. సైనికులకంటే వ్యాపారులే మరిన్ని సాహసాలు చేస్తారని వ్యాఖ్యానించడంద్వారా మోడీ...సైనికులను అవమానించారన్నారు. బీజేపీ వ్యాపారుల పార్టీ అని శివసేన భావిస్తే ఆ పార్టీతో ఇంకా పొత్తు ఎందుకంటూ ఉద్ధవ్‌ని నిలదీశారు. -
మోడీ అద్భుతమైన నాయకుడు: నాగమణి
పదే పదే పార్టీలు మారే అలవాటున్న నాయకునిగా పేరొందిన నాగమణి.. ఎన్సీపీకి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీల కూటమికి మొదటి దెబ్బ తగిలింది. అంతేకాదు, నాగమణి బహిరంగంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతు పలికారు. ఆయన ఇన్నాళ్లూ ఎన్సీపీ బీహార విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతోపాటు ఎన్సీపీ తరఫున జార్ఖండ్‌లో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే గడిచిన రెండున్నర నెలలుగా ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తాను మోడీ నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. వాస్తవానికి నాగమణికి బీహార్‌లో ఒక ఎంపీ టికెట్ ఇప్పించాలని ఎన్సీపీ భావించింది. కానీ ఇప్పుడు కేవలం కేంద్ర మంత్రి తారిఖ్ అన్వర్ ఒక్కరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. బీహార్‌లో వెనకబడిన వర్గాల తరఫున నిలబడి పోరాడిన నాయకుడు, ఫైర్ బ్రాండ్ లీడర్ జగదేవ్ ప్రసాద్ కుమారుడైన నాగమణి.. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ.. ఇలా పలు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ గూటికి చేరుతున్నారు. తాను ఒక్క నరేంద్ర మోడీ తప్ప సీనియర్ నాయకులు అందరినీ కలిశానని, కాంగ్రెస్‌తో చేతులు కలపడం తనకెప్పుడూ ఇష్టం లేదని ఆయన చెప్పారు.