నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలి
-ఎంఈఓ ఉదయ్‌భాస్కర్
జగదేవ్‌పూర్:ఆఫ్రికాలో పర్వాతారోహణ చేసి జాతీయ జెండాను ఎగురవేసిన విద్యార్థి నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్, జెడ్పీటీసీ రాంచంద్రం అన్నారు. జగదేవ్‌పూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని ఆఫ్రికాలో పర్వతరోహణ చేసి శుక్రవారం జగదేవ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా నాగమణికి జగదేవ్‌పూర్ ప్రభుత్వ, ప్రైవైట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధకారులు ఘన స్వాగతం పలికారు.
పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్‌సీ కార్యాలయం వద్ద నాగమణికి పూలమాలలు వేసి అభినందించారు. రత్నశ్రీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు నగదు బహుమతి అందించారు. అనంతరం ఎంఈఓ, జెడ్పీటీసీ మాట్లాడుతూ నాగమణి మట్టిలో మణిక్యమని, పేదింట్లో వెలుగు జ్యోతి అని అభినందించారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రంగంలో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఎంపీడీఓ పట్టాభిరామారావు, పాఠశాల ప్రత్యేక అధికారి శారద, పీఆర్‌టీయూ, టీటీఎఫ్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శశిధర్‌శర్మ, శంకర్, కో-ఆప్షన్ సభ్యుడు మునీర్ ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.