మద్యం మత్తులో ఓ తండ్రి కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్నె ఉపేందర్, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే, ఉపేందర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇదే విషయమై భార్య నాగమణి బుధవారం సాయంత్రం ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన ఉపేందర్ భార్యను కొట్టేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. అక్కడే ఇంటి అరుగుపై కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లగా తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూతురు(7) చెప్పింది. ఈ విషయమై నాగమణి తన తండ్రితో కలసి భర్తను నిలదీయగా వారిపైనా చేయిచేసుకున్నాడు. దీంతో.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ నాగమణి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉపేందర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి.కరుణాకర్ తెలిపారు.
కూతురిపై తండ్రి దారుణం
Published Thu, Sep 8 2016 7:41 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement
Advertisement