అన్నానగర్(చెన్నై): కోయంబత్తూరులోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరు తన్నీర్‌పందల్ రోడ్డులో ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంది. దీనికి రెండు షట్టర్లు ఉన్నాయి. ఇందులో ఓ షట్టర్‌కు ఆదివారం రాత్రి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఏటీఎం మరమ్మతుకు గురైందని భావించి ఎవరూ అక్కడ నగదు తీయడానికి రాలేదు. ఈ స్థితిలో సోమవారం సాయంత్రం ఆక్సిస్ బ్యాంక్ అధికారులు ఆ దారిన గస్తీకి వచ్చారు. ఎటీఎం మెయిన్ షట్టర్ మూసి ఉండడం చూసి లోపలికి వెళ్ళి చూశారు. ఏటీఎం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఏటీఎం నుంచి రూ.26 లక్షల నగదు చోరీ అయినట్టు తేలింది. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment