నల్లజర్ల రూరల్ : ఫోర్జరీ డాక్యుమెంట్లకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారంలో నల్లజర్ల తహసిల్దార్‌గా పనిచేసిన డీవీ సుబ్బారావు, వీఆర్వోలు అద్దంకి వరప్రసాద్, ఆర్ వీ శ్రీనివాస్‌లకు ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం గుండేపల్లిలో 2013 ఫిబ్రవరిలో కొంతమంది రైతుల భూము లు వారికి తెలియకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలతో వేరొకరికి రిజిస్ట్రేషన్ అయిపోయూయి. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు భూసేకరణ సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది మే 23వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అప్పటి తహసిల్దార్ కె.పోసియ్య, ఆర్‌ఐ పోతురాజు విచారణ చేశారు.
కొత్త వ్యక్తుల పేర్లతో వెలుగులోకి.. ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం సేకరించిన భూములపై గెజిట్ పబ్లికేషన్ జాబి తాలో కొత్త వ్యక్తుల పేర్లు ఉండటంతో అసలు రైతులు ఆరా తీశారు. ఆర్‌ఎస్ నంబరు 351బై1ఎలో రైతులు ఆలపాటి శివరామకృష్ణ, అయినాల రాజారావులకు చెందిన 4.35 సెంట్లు భూమిని అదే గ్రామానికి చెందిన ఎటువంటి భూములు లేని ఈదరాడ రామబ్రహ్మం, జొన్న వెంకటేశ్వరరావు పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు సృష్టించి వారితోనే ఆరెళ్ళ రం గారావు, కంకటాల భూషణరావు పేర రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. భూములు కోల్పోయిన నిర్వాసితుల జాబితాలో వీరి పేర్లే ఉండడంతో దానిపై మార్చి 3న రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. విచారణలో ఈ విషయాలన్నీ నిజమని వెల్లడయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో రికార్డులను తారుమారు చేసిన అప్పటి వీఆర్వో అద్దంకి వరప్రసాద్, మరో
వీఆర్వో ఆర్‌వీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
ఒక్కొక్కటిగా..
మండల రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారుు. ఆర్‌ఎస్ నంబరు 84లో మందపాటి వెంకట్రామయ్య, దొడ్డిపట్ల వీరయ్య, మాండ్రాజు వెంకన్న, పెనుమత్స బద్రా యమ్మలకు చెందిన 6 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతమైనట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందారుు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. విచారణలో వెల్లడైన విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని, ఫోర్జరీ పాస్ పుస్తకాలు రద్దు చేస్తామని విచారణ అధికారి కె.పోసియ్య అప్పట్లో ప్రకటించారు.
రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు
Published Wed, Jun 18 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement