ఎద్దుల బండిని ఢీ కొని గాయాలు | one person injured by bike accident | Sakshi
Sakshi News home page

ఎద్దుల బండిని ఢీ కొని గాయాలు

Published Thu, Nov 24 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

one person injured by bike accident

ప్రొద్దుటూరు క్రైం: ఎద్దుల బండిని ఢీ కొనడంతో బైక్‌లో వెళ్తున్న సుబ్బారావు గాయ పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన సుబ్బారావు కమీషన్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతను బైక్‌లో గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రాజుపాళెం సమీపంలోకి వెళ్లగానే ప్రమాదవశాత్తు ఎడ్ల బండిని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపు భాగంలో తీవ్ర గాయం కావడంతో బెంగుళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యుడు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement