ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సుబ్బారావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సుబ్బారావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. సుబ్బారావుకు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.
కాగా కృష్ణాజిల్లా పామర్రులో సుబ్బారావు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని ఉత్తరం రాసి ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.