తాడేపల్లిగూడెం : చుక్కా అచ్చయ్య చనిపోయి 24 నెలలు కావస్తోంది. ఇనుగంటి వెంకటేశ్వర్రావు పరమపదించి 13 నెలలు అవుతోంది. చిన్ని నూకాలమ్మ పెదకార్యం జరిగి ఎనిమిది నెలలైంది. అయినా వారందరికీ క్రమం తప్పకుండా పింఛన్ వస్తోంది. కట్టా సుబ్బారావు కుష్టు వ్యాధిబారిన పడటంతో అతడి పదివేళ్లు దెబ్బతిన్నాయి. ఆయనకు వృద్ధాప్య పింఛన్ ఉంది. కానీ.. పింఛను మొత్తం తీసుకోవడానికి ప్రతినెలా ఒక ప్రాంతానికి రిక్షాపై వెళ్లాలి. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం రిక్షా వాలాకు ఇవ్వాలి.
ఆ బాలుడు మూగ, చెవుడుతో బాధపడుతున్నాడు. చేతివేళ్లు ముడుచుకుపోయూరుు. వేలి ముద్రవేస్తే కాని ఆ బాలుడికి పింఛన్ ఇవ్వనంటారు. ‘ఆధార్ నంబర్ ఉందా.. వేలిముద్ర పడటం లేదు. మళ్లీ రా’ అంటున్నారు. అన్నీ బాగుంటే ‘బ్యాటరీ డౌనయ్యింది. రెండు రోజులు ఆగి రా’ అని పంపేస్తున్నారు. ఇలా పండుటాకుల జీవితాలతో పింఛన్ సొమ్ము పంపిణీ చేసే బాధ్యత చేపట్టిన ఏజెన్సీలు ఆటలాడుకుంటున్నారుు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఠంచనుగా పింఛన్ వచ్చేది. ఇప్పుడు టెన్షన్‌గా తయూరైంది.
చనిపోయిన వారి పేర్లను అర్హుల జాబితాంచి తొలగించని అధికారులు, బతికున్న వారిని మాత్రం పదేపదే తిప్పించుకుంటూ వారి ఓపికను పిప్పి చేస్తున్నారు. చేయి ఉండి, దానికి వేళ్లుండి, వేలిముద్రలు మెషిన్‌లో పడకపోయినా ఆ పాపం వృద్ధులదే అన్నట్టుగా నెలల తరబడి పింఛన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే లబ్డిదారులు అనర్హుల జాబితాలో చేరతారు. తర్వాత పునరుద్ధరణ దేవుడికే ఎరుక. ఇది ఒకరిద్దరు వృద్దుల కష్టం కాదు. జిల్లాలో 70వేల మంది పింఛనుదారులు 90 రోజు లుగా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు
జిల్లాలో అన్నిరకాల పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు 3.60 లక్షల మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలలో మొదటి వారంలో వీరికి ఠంచన్‌గా పింఛన్ అందేది. కేవలం రెండు గంటల వ్యవధిలో నిర్దేశించిన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ చకచకా జరిగిపోయేది. జాబితా ఆధారంగా సొమ్ములు పంపిణీ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ కార్డులు అన్నారు. వీటివల్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తిం చి తపాలా శాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ప్రాంతాల వారీగా కొన్ని బ్యాంకులకు వీటి పంపిణీ బాధ్యతను అప్పగించారు.
బ్యాంకులు మణిపాల్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించాయి. వీటి ఆధ్వర్యంలో పంపిణీ తంతు హైడ్రామాగా సాగుతోంది. విషయ పరిజ్ఞానం తక్కువగా ఉన్న సిబ్బంది వృద్ధులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి జేబులోని సొమ్ము ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ సరిగా అందక లబ్దిదారులు చాలాపాట్లు పడుతున్నారు. ఇచ్చే రెండొందల కోసం నెలలో పది రోజు లకు పైగా ఆయా ప్రాంతాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పంపిణీ వ్యవహారం అంతా దైవాధీనం సర్వీసులా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
పెంచుతారా.. ముంచుతారా
అక్టోబర్ నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. అరుుతే, దీనికి ముందుగానే లబ్ధిదారుల సంఖ్యను కుదించాలంటూ అధికారులకు ఆదేశాలు అందారుు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా వేలి ముద్రలు పడటం లేదు, ఆధార్ నంబర్ లేదని, బ్యాటరీ డౌన్ అరుు్యందని, సాంకేతిక సమస్య వచ్చిందంటూ లబ్ధిదారులను మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇలా మూడు నెలలు తిప్పించుకున్నాక పింఛన్ రద్దరుు్యందని చెప్పి చేతులు దులుపేసుకునే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
పోరుునోళ్లకు పింఛన్.. బతికున్నోళ్లకు టెన్షన్
Published Sat, Jul 19 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement