నెల్లూరు : మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాకు తగిలి మృతి చెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎం. సుబ్బారావు (43) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారుజామున వేరుశనగ పంటకు నీళ్లు పెట్టడానికి బావి వద్దకు వెళ్లి... మోటర్ స్విచ్ ఆన్ చేశాడు. ఇంతలో కరెంట్ షాక్ తగిలి అతడు అక్కడికక్కడే మరణించాడు.
అయితే సుబ్బారావు ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలం వచ్చారు. బావి వద్ద సుబ్బారావు మృతదేహం పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు హాతాశులయ్యారు. దాంతో మృతదేహన్ని కుటుంబ సభ్యులు స్థానికులు సహాయంతో ఇంటికి చేర్చారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.