
రాశిఫలాలు ( అక్టోబర్ 26 నుండి నవంబర్ 1వరకు )
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురుండదు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రిహణి, మృగశిర 1,2పా.)
పరిశోధనలపై దృష్టసారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో భూవివాదాలు. అనారోగ్యం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి అవార్డులు. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆప్తుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తొలగుతాయి. వారం మధ్యలో రుణయత్నాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి ఉత్సాహవంతం. వారం చివర్లో ఆరోగ్యభంగం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం మధ్యలో ప్రయాణాలలో ఆటంకాలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివర్లో వ్యయప్రయాసలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. నూతన వ్యక్తుల పరిచయం. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు.