వారఫలాలు (5 జూలై నుంచి 11 జూలై, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. నీలం, లేత ఆకుపచ్చరంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ప్రారంభంలో కొన్ని వ్యవహారాలు మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. బంధువులు, మిత్రులతో సర్దుబాటు కాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులు, విద్యార్థులు మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులకు, కళారంగం వారికి యోగవంతంగా ఉంటుంది. తెలుపు, లేత పసుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనుల్లో పురోగతి సాధిస్తారు. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. చాక్లెట్, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. కళారంగం వారికి సన్మానాలు. గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. అనుకున్నది సాధిస్తారు. భూ వివాదాలు తీరుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు విస్తరిస్తారు. లేత ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు పూర్తి కాగలవు. సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మీ దారికి వస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఎరుపు, సిమెంట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి అర్చన చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యం కొంత చికాకు కలిగించవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల విస్తరణలో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. గులాబీ, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నీలం, ఆకుపచ్చరంగు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు. నలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఈవారం పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. బంధువులను కలుసుకుంటారు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. పసుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు