వారఫలాలు (31 మే నుంచి 6 జూన్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూసంబంధిత వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నారింజ, తెలుపు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టక స్తోత్రం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహణి, మృగశిర 1,2 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కీలక నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగలాభం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలు పుంజుకుంటాయి. రాజకీయవర్గాలకు పదవులు. పసుపు, లేత ఎరుపు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శ్రేయోభిలాషులు తోడుగా నిలుస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం. వాహనాలు, భూములు కొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పనులు పూర్తి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి ఆదరణ. నీలం, ఆకుపచ్చ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సేవలు గుర్తింపు పొందుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగుతాయి. వ్యాపారాలలో కొంతవరకూ లాభాలు అందుతాయి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలను పదవులు వరించే సమయం. గులాబీ, లేత పసుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ సీతారామస్తోత్రం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక లావాదేవీల్లో నిరాశ. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి వ్యతిరేకత. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో మందకొడి. పనులు శ్రమానంతరం పూర్తి. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కొంత గందరగోళం. ఆకుపచ్చ, నీలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్తోత్రం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. చిన్ననాటి మిత్రుల కలయిక. సమస్యల నుంచి ఊరట. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ దుర్గాస్తుతి మంచిది.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో విజయం. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగు. వాహనయోగం. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు పూర్తి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. సమస్యల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. శ్రమకు తగ్గ ఫలితం. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. సిమెంట్, లేత ఆకుపచ్చ. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం,ఆకుపచ్చ. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు నెమ్మదిగా సాగినా చివరికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, క్రీమ్. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగండి, విజయాలు వరిస్తాయి. నిరుద్యోగుల కృషి వృథా కాదు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని రుణాలు తీరుస్తారు. పరపతి పెరుగుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. పసుపు, లేత ఎరుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు