వారఫలాలు (26 ఏప్రిల్ నుంచి 2 మే, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
బంధువర్గంతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాల అంచనాలు తప్పుతాయి. కీలక నిర్ణయాలు. స్వల్ప ధనలాభం.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువుల కలయిక. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. బంధువులతో సఖ్యత. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార లాభం. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. సంతోషకరమైన సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో అంతరాయాలు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు శ్రమ. వ్యాపారాల్లో స్వల్పలాభం. ఉద్యోగులకు మార్పులు. విదేశీ పర్యటనలు వాయిదా. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీసేవలకు గుర్తింపు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. శుభకార్యాలలో పాల్గొంటారు. అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి పురస్కారాలు. వారం మధ్యలో చికాకులు. ధనవ్యయం.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
సోదరులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు. కార్యక్రమాలు విజయవంతం. నిరుద్యోగులకు భవిష్యత్‌పై కొత్త ఆశలు. పరపతి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఖర్చులు.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగు. సన్నిహితులతో సఖ్యత. వాహనాల కొనుగోలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలలో తొందరతగదు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీల్లో నిరాశ. రుణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. శుభకార్యాలలో పాల్గొంటారు.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితిలో నిరాశ. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆక స్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. తీర్థయాత్రలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. పర్యటనలు వాయిదా. శుభకార్యాలు. ధన, వస్తులాభాలు.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
శ్రమ ఫలిస్తుంది. పనుల్లో పురోగతి. శుభవార్తలు. ఆలోచనలకు కార్యరూపం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆదరణ. వాహనయోగం. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు. సన్మానాలు, పురస్కారాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు సకాలంలో పూర్తి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు