వారఫలాలు (28 జూన్ నుంచి 4 జూలై, 2015 వరకు) | astrology of the week on june28 to july 04 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (28 జూన్ నుంచి 4 జూలై, 2015 వరకు)

Published Sun, Jun 28 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

వారఫలాలు (28 జూన్ నుంచి 4 జూలై, 2015 వరకు)

వారఫలాలు (28 జూన్ నుంచి 4 జూలై, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగుతాయి. పనులు ఆలస్యంగా పూర్తి. సంఘంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నేరేడు, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. గుర్తింపు పొందుతారు. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ధార్మిక చింతన. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. చాక్లెట్, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సత్కారాలు. గులాబీ, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గోధుమ, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి. పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సన్నిహితులు, మిత్రులతో చర్చలు జరుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్. ఆకుపచ్చ, తెలుపు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. కళారంగం వారికి పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానం.  సంఘంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు హోదాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రతిభకు తగిన గుర్తింపు. వ్యవహార విజయం. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, తెలుపు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. నిరుద్యోగులకు కొత్త ఆశలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష ఆదరణ . భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఈవారం పట్టింది బంగారమే. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగు. రావలసిన సొమ్ము అందుతుంది. మిత్రులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. నైపుణ్యానికి గుర్తింపు రాగలదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, విదే శీ పర్యటనలు. నలుపు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. గుర్తింపు రాగలదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గ డుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి పురస్కారాలు. బంగారు, గులాబీరంగులు, వేంకటేశ్వరస్తుతి మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement