వారఫలాలు (21 జూన్ నుంచి 27 జూన్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో కొద్దిపాటి జాప్యం ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సహకారం అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. తెలుపు, బిస్కెట్ రంగులు, ద క్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు అంచనాలు తప్పుతాయి. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఈవారం పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, సన్మానాలు. చాక్లెట్, ఆకాశనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పై స్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు దక్కించుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. ఆకుపచ్చ, తేనెరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. నీలం, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులకు కలిసివ చ్చే కాలం. కళారంగం వారికి అవార్డులు దక్కవచ్చు. గులాబీ, ఆరెంజ్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు, సత్కారాలు. లేత ఎరుపు, తెలుపు రంగులు, గణేశ్ స్తోత్రాలు పఠించండి. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నేరేడు, నీలం రంగులు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. గోధుమ, చాక్లెట్‌రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు