వారఫలాలు (24 మే నుంచి 30 మే, 2015 వరకు) | astrology of the week on may 24to may 30 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (24 మే నుంచి 30 మే, 2015 వరకు)

Published Sun, May 24 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

వారఫలాలు (24 మే నుంచి 30 మే, 2015 వరకు)

వారఫలాలు (24 మే నుంచి 30 మే, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు జాప్యం జరిగినా పూర్తి కాగలవు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చాకచక్యంతో సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ఉత్సాహవంత ం. పారిశ్రామిక రంగం విజయాలబాట. చాక్లెట్, ఆరెంజ్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలలో అనుకూలత. ప్రముఖుల పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు. భూములు, వాహనాల కొనుగోలు. పుణ్యక్షేత్ర సందర్శనం. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయ వర్గాలకు పదవులు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శ్రమకు తగ్గ ఫలితం అందక నిరాశ. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారి యత్నాలు సాగవు. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
విధేయులు పెరుగుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. సిమెంట్, లేత ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. మీ ఆశయసాధనలో కుటుంబసభ్యుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరెంజ్, నేరేడురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఓర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి యోగవంతమైన కాలం. నీలం, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఈవారం పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. వివాదాలు తీరతాయి. గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాల కొనుగోలు. ఆలయ దర్శనాలు. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు సన్మానయోగం. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు, శివాలయ దర్శనం అనుకూలం.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగు. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, సిమెంట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

పనుల్లో కొద్దిపాటి జాప్యం. వివాదాలను పరిష్కరించు కుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు పదవులు ఊరిస్తాయి. తె లుపు, బిస్కెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానాలు, రివార్డులు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఒక సమస్య చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి పురస్కారాలు. చాక్లెట్, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
-  సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement