
చిరంజీవి-లోకేష్
విశాఖపట్నం: మహాకామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు నిన్న ఇక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్యలో రాజకీయ అంశాలను ప్రస్తావించారు. మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ భవిష్యత్లు ఏ రంగంలో ఉంటే బాగుంటుందో జోస్యం చెప్పారు. దేవీనవరాత్రి ఉత్సవ విశేషాలను వివరించే సందర్భంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.
లోకేష్ రాజకీయాలలోకంటే సినిమా రంగంలో అయితే బాగా రాణిస్తారని చెప్పారు. ఆయన జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయని తెలిపారు. రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉంటే సినిమాలలో బాగా రాణిస్తారని చెప్పారు. గతంలో తాను చిరంజీవికి రాజకీయ భవిష్యత్ లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చిరంజీవి సినిమా భవిష్యత్ బాగుంటుదన్నారు. అయితే ఆయన రాజకీయాలలో పనికిరారా? అంటే రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు సినిమా భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. రాహుకేతువులు అంటే ఛాయాగ్రహాలు కదా, ఛాయాగ్రాహకుడి సంబంధం ఎక్కువగా ఉంటుందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంటనే మఠాధిపతులు, పీఠాధిపతులతో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. టిటిడి పాలకమండలిలో వ్యాపారస్తులకు అవకాశం ఇవ్వవద్దని అయ్యన్న పంతులు చెప్పారు.
**