వారఫలాలు (19 ఏప్రిల్ నుంచి 25ఏప్రిల్, 2015 వరకు) | astrology of the week on april 19 to april 25 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (19 ఏప్రిల్ నుంచి 25ఏప్రిల్, 2015 వరకు)

Published Sun, Apr 19 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

వారఫలాలు (19 ఏప్రిల్ నుంచి 25ఏప్రిల్, 2015 వరకు)

వారఫలాలు (19 ఏప్రిల్ నుంచి 25ఏప్రిల్, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. ఆర్థిక పరిస్థితి మెరుగు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి పెరుగుతుంది. కార్యక్రమాలు విజయవంతం. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు తగిన ప్రోత్సాహం. విద్యార్థులకు అనుకూల  ఫలితాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. దుబారా ఖర్చులు.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న రీతిలో సొమ్ము అందుతుంది. రుణబాధలు, అపనిందలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీక రిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆలయ సందర్శనం.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో  ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో కొన్ని పనులు మందగించినా క్రమేపీ పురోగతి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో తగాదాలు.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువుల నుంచి సమాచారంతో ఊరట. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో పురోగతి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల ఆశలు ఫలించే సమయం. వాహన, ఆభరణాల కొనుగోలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతితో బదిలీలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా  పైచేయి. పనుల్లో విజయం. పుణ్యక్షేత్ర సందర్శనం. కుటుంబంలో శుభకార్యాలు. గృహ నిర్మాణయత్నాలు.  చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. కళారంగం వారికి అవార్డులు. అనుకోని ఖర్చులు.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. కార్యక్రమాలు సజావు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.  కుటుంబసభ్యులతో వివాదాలు.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. కొన్ని పనులు వాయిదా. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారికి చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం.
-  సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement