
రాశి ఫలాలు ( డిసెంబర్ 7 నుండి 13 వరకు )
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులు మరింత అప్రమత్తంగా మెలగాలి. పారిశ్రామికరంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో వాహనయోగం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో అనారోగ్యం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. భూవివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
చికాకులు క్రమేపీ సర్దుబాటు కాగలవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి తోడ్పాటు ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. శ్రమ ఫలించే సమయం. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో సానుకూలత. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో తగాదాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు అసంతృప్తి కలిగించినా అవసరాలు తీరతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు గుర్తింపు, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి అవార్డులు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఏ పని చేపట్టినా విజయమే. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. మిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు జాప్యం జరిగినా పూర్తి కాగలవు. దూరప్రయాణాలు ఉంటాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు