వారఫలాలు (10 మే నుంచి 16 మే, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు దక్షతను చాటుకుంటారు. ధనవ్యయం. లేత గులాబీ, పసుపు. తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలలో పురోగతి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. చికాకులు. ఆకుపచ్చ, నీలం.ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు నెమ్మదిగా పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. నేరేడు, బిస్కెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలలో జాప్యం. ఆలోచనల అమలు. చిన్ననాటి మిత్రులను కలయిక. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంటాబయటా ఎదురుండదు. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాల కొనుగోలు. కొన్ని వ్యవహారాలలో సత్తా చాటుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
సన్నిహితులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆలయ సందర్శనం. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. కుటుంబంలో శుభకార్యాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పనులు సాఫీగా సాగుతాయి. శుభకార్యాల నిర్వహణ. గృహం, భూములు కొనుగోలు యత్నాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. నీలం, సిమెంట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు నిదానంగా సాగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. సమస్యల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. తీర్థయాత్రలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు. విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. లేత పసుపు, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితిలో నిరాశ. శ్రమాధిక్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, సిమెంట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పట్టింది బంగారమా అన్నట్టుంటుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూరి్తు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు. స్థిరాస్తి ఒప్పందాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివపంచాక్షరి పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని ర్యాంకులు. ఆలోచనలు కలసివస్తాయి. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. వృత్తివ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యభంగం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. భూములు, వాహనాలు కొనుగోలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు