వారఫలాలు : 30 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూ రుతుంది. సమయానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. కోర్టు కేసు ఒకటి పరిష్కార దశకు చేరుకుంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు. నీలం, చాక్లెట్‌రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. తెలుపు, లేత గులాబీరంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు వ్యవహారాలలో సహాయపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్న నాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు మొదట్లో నెమ్మదించినా క్రమేపీ వేగం పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం, కుటుంబ విషయాలలో కొద్దిపాటి చికాకులు. వాహనయోగం. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నేరేడు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. లేత ఆకుపచ్చ, పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీధ్యానం చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. సత్తా చాటుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. నీలం, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభంలో చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యవహారాలలో ప్రగతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, చాక్లెట్‌రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాలు పరిష్కార మవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. గులాబీ, తెలుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యవహారాలు మీకు సవాలుగా నిలుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశ తప్పదు. నీలం, నలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కుటుంబ సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. సంఘంలో మీదే పైచేయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అభివృద్ధిలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నేరేడు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి, సోదరుల ద్వారా ధన, ఆస్తి లాభ సూచనలు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.