వారఫలాలు (18 జనవరి నుంచి 24 జనవరి, 2015 వరకు ) | astrology of the week on january 18 to january 24 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (18 జనవరి నుంచి 24 జనవరి, 2015 వరకు )

Published Sun, Jan 18 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

వారఫలాలు (18 జనవరి నుంచి 24 జనవరి, 2015 వరకు )

వారఫలాలు (18 జనవరి నుంచి 24 జనవరి, 2015 వరకు )

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఊహలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్యసమాచారం అందుతుంది. ఉద్యోగులకు కొత్త ఆశలు. కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గం వారికి పదవీయోగం.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి  కలిగిన వారితో పరిచయాలు. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి అవార్డులు. వారం మధ్యలో అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా
 
కన్య: (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయోగం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. వారం ప్రారంభంలో అస్తి వివాదాలు. అనారోగ్యం.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.  ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలకు ఉత్సాహం. ఉద్యోగులకు  విధుల్లో  చికాకులు తొలగుతాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఇంటాబయటా అనుకూల పరిస్థితి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. కళారంగం వారికి సన్మానాలు. మధ్యలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు కాస్త మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది.  భూలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాల వారికి పదవీయోగం. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా.
 
కుంభం: (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి.  అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం. శుభవార్తలు. ధనలాభం.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టింది బంగారమే. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.

- సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement