గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.పంచమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పుబ్బ ప.3.39 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.11.06 నుండి 12.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.41 నుండి 8.10 వరకు, అమృతఘడియలు: ఉ.8.16 నుండి 10.01 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 5.43.
మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం: రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం: భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.
కన్య: పనులు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
తుల: ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి లాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మకరం: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు. పనులు వాయిదా. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment