
రాశి ఫలాలు ( నవంబర్ 23 నుండి 29 వరకు )
సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నేర్పుగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్‌లు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. సోదరులు, మిత్రుల చేయూతతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భవనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. బంధువులు, మిత్రుల నుంచి కీలక సమాచారం. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళారంగం వారికి నూతనోత్సాహం, సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామివర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో రుణయత్నాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకం. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణదాతల ఒత్తిడులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులు, బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరమైన హామీలు తగవు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటాబయటా అనుకూల వాతావరణం. పనులు చకచకా పూర్తి చేస్తారు. కొన్ని రుణాలు తీరతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళారంగం వారికి అవార్డులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తివివాదాలు. ఆరోగ్య సమస్యలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త ఊరటనిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.