వారఫలాలు (12 జూలై నుంచి 18 జూలై, 2015 వరకు) | astrology of the week on july 12 to july 18 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (12 జూలై నుంచి 18 జూలై, 2015 వరకు)

Published Sun, Jul 12 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

వారఫలాలు (12 జూలై నుంచి 18 జూలై, 2015 వరకు)

వారఫలాలు (12 జూలై నుంచి 18 జూలై, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి ఆరాధన మంచిది.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగయత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు  సన్మానయోగం. చాక్లెట్, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణ విభేదాలు. కుటుంబ బాధ్యతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వివాహ, ఉద్యోగయత్నాల్లో నత్తనడక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, తెలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. చిరకాల మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబీ, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం. విద్యార్థులకు కొత్త ఆశలు. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. లేత ఆకుపచ్చ, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగు. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వాహనాలు, భూముల కొనుగోలు. ఆలోచనలు కార్యరూపం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు నెమ్మదిస్తాయి. కుటుంబ సమస్యలు. బంధువులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. విదేశీ పర్యటనలు రద్దు. ఆకాశనీలం, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. నిర్ణయాల పునఃసమీక్ష. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవర్గాలకు అశాంతి. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలోచనలు కార్యరూపం. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు. చాక్లెట్, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక పురోగతి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆలోచనలు కార్యరూపం. స్వల్ప అనారోగ్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. చాక్లెట్, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. బాధ్యతలు మీద వేసుకుని సతమతమవుతారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలతో చికాకు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. నీలం, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి నిరాశ. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. నిర్ణయాలలో తొందరవద్దు. మిత్రులే శత్రువులుగా మారతారు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. గోధుమ, ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement