మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. పనులు చకచకా సాగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. యుక్తితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాల వారు ఉత్సాహంగా గడుపుతారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పనులు సకాలంలోనే పూర్తి కాగలవు. వాహనాలు, ఆభర ణాలు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు కొంటారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ, అభిమానం పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వస్తువులు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
బంధువులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, కుటుంబంలో చికాకులు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. వేడుకల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. శ్రమ తప్పదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. బంధువులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో పనులలో అవాంతరాలు.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష పండితులు
చంద్రబింబం: నవంబర్ 2 నుండి 8 వరకు
Published Sun, Nov 2 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement