వారఫలాలు : 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహణి, మృగశిర 1,2 పా.)
మీ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళారంగం వారికి సన్మానాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆటంకాలు తొలగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. గులాబీ, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌చాలీసా పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓర్పు,నేర్పుగా వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. లేత ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గాయత్రీధ్యానం చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా అనుకూలత. ఉద్యోగయత్నాలు సానుకూలమవు తాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు పదవీయోగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఊహించని విధంగా సొమ్ము చేతికంది అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వాహన సౌఖ్యం. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కళారంగం వారికి ఆహ్వానాలు రాగలవు. తెలుపు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణదిశగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామివర్గాలకు అనుకోని ఆహ్వానాలు. నీలం, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము అందే సూచనలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. గులాబీ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు